ఒకప్పుడు అయితే  హీరోయిన్లు నటనకు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకునేవారు. ముఖ్యం గా అందాల ఆరబోతలో చాలా మంది హీరోయిన్లు వెనకడుగు వేసేవారు. అయితే తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో బోల్డ్ పాత్రలకు హీరోయిన్స్ చాలా దూరం ఉండేవారు. కానీ అటు బాలీవుడ్ లో మాత్రం ఎంతో మంది హీరోయిన్లు బోల్డ్ పాత్రల్లో నటించి మెప్పించారు.  కానీ ఇప్పుడు మాత్రం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా  హీరోయిన్లు అలాంటి లిమిటేషన్స్ ఏం పెట్టుకోవడం లేదు. పాత్ర డిమాండ్ చేయాలే గానీ ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు మేము రెడీ అంటూ చెప్పేస్తున్నారు..

 ఇప్పటికే పలువురు హీరోయిన్లు బోల్డ్ పాత్రల్లో నటించి తమ నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. మొదటి నుంచి ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన అమలాపాల్.. 'అడై' అనే సినిమాలో పూర్తిగా బోల్డ్ పాత్రలో నటించింది. ఈ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా బోల్డ్ పాత్ర కోసం సిద్ధమయ్యిందట. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ఆండ్రియా. ప్రస్తుతం తమిళంలో 'పిషాసు' అనే సినిమాలో నటిస్తోంది.



 తెలుగులో ఈ సినిమా పిశాచి అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నగ్నంగా నటించేందుకు ఆండ్రియా సిద్ధం అయిందట . ఈ సినిమాలో ఈ అమ్మడి  పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందని.. అందుకే నగ్నంగా నటించి కూడా సాహసం చేసేందుకు సిద్ధమైందట ఈ ముద్దుగుమ్మ.  కొంత మంది సమక్షంలో నగ్న సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఆండ్రియా నగ్న పాత్రలో నటించిందని తెలియగానే.. ఇక ఈ సినిమాలో అసలు ఈ హీరోయిన్ పాత్ర ఏ రేంజ్లో ఉండబోతుందో అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: