ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హీరోలు తెలుగు సినిమా స్థాయిని, బడ్జెట్ ని అమాంతం పెంచేశారు.  గతంలో 50 కోట్లకు మించని టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు ఇప్పుడు వందల కోట్లకు చేరుకుంది. నిర్మాతలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదల అవుతుండటంతో ఖర్చు కు కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు. హీరోలు అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తూ పాన్ ఇండియా రేంజ్ నలో సినిమాలు నిర్మిస్తూ దానిద్వారా ఎంతో గుర్తింపు దక్కించుకున్నారు. ఆ విధంగా టాలీవుడ్ లో సినిమా కోసం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.

బాహుబలి సినిమా తర్వాత చిత్ర పరిశ్రమలో భాష పరిమితులు చెల్లాచెదురయ్యాయి. టాలీవుడ్ హీరోలకి తమిళంలో గతంలో లేని క్రేజ్ ఈ సినిమా తరువాత పెరిగింది. ఈ విషయంలో కోలీవుడ్ హీరోలను మెచ్చుకోవాలి. పాన్ ఇండియా సంస్కృతి టాలీవుడ్లో మొదలు కాక ముందు నుంచి వారు తమ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. రజినీ కమల్ హాసన్ సూర్య లాంటి హీరోలంతా తెలుగులో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు.

ఇటీవలే ఇళయదలపతి విజయ్ కూడా తెలుగులో మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. తుపాకి సినిమా నుంచి విజయ్ తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ వచ్చారు. ఇటీవలే సంక్రాంతి కానుకగా మాస్టర్ సినిమా తో వచ్చే హిట్ కొట్టి మరింత క్రేజ్ పెంచుకున్నాడు టాలీవుడ్లో. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో చిత్రానికి విజయ్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇటీవల ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించగా ఈ సినిమా కోసం దిల్ రాజు విజయ్ కి 50 కోట్లు చెల్లించినున్నట్లు సమాచారం. ఇప్పటికే 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని మొత్తం విడతల వారీగా చేస్తారని అంటున్నారు. ఆతనకున్న క్రేజ్ దృష్ట్యా వందకోట్ల రెమ్యునరేషన్ అయినా దిల్ రాజు ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: