కరోనా రెండో దశ మెల్ల మెల్లగా తన విజృంభనను తగ్గించుకుంది. వేల సంఖ్యలో మరణాలు, లక్షల్లో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా టాలీవుడ్ కూడా షట్ డౌన్ అయింది. షూటింగ్ లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. థియేటర్లు మూత పడ్డాయి దాంతో మళ్ళీ థియేటర్ లు ఎప్పుడు తెరుచుకుంటాయి అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇది శుభసూచకం. ఇప్పటికే హిందీ చిత్ర పరిశ్రమలో చిత్రీకరణలు మొదలయ్యాయి. విడుదలకు కూడా సిద్ధమవుతున్నాయి సినిమాలు. 

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర హీరోలు సెట్స్ పై సందడి చేస్తుండగా మరికొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి ముస్తాబు అవుతున్నాయి. మరి తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి వాతావరణం ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. పూర్తి పక్కా ప్లానింగ్ తోనే టాలీవుడ్ రంగంలోకి దిగి రాబోతోందని అంటున్నారు. 

అన్ని సినిమాల యూనిట్లు ఇప్పటికే షూటింగ్ లకు, విడుదలకు సిద్ధమవుతుండగా వ్యాక్సినేషన్ తర్వాత ఏ పనైనా చేపట్టే విధంగా ఉండాలని టాలీవుడ్ పెద్దలు వారికి సూచించారట. ఇప్పటికే చాలా నిర్మాణ సంస్థలు హీరోలు తమ చిత్రాలకు పనిచేస్తున్న సభ్యులకు వ్యాక్సిన్లు వేయించాయి. చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వ్యాక్సినేశన్ జరుగుతోంది. సినిమా చిత్రీకరణలో పాల్గొనే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ చేయించుకున్న వారై ఉండాలని నియమం పెట్టుకున్నారట. మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ సినిమాలతో కళకళలాడుతుందన్నమాట. ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ అవడానికి మెగా స్టార్ చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, బాలకృష్ణ అఖండ, ప్రభాస్ రాదే శ్యాం, నాని టక్ జగదీష్, విజయ్ దేవరకొండ లైగర్ , రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏవి తమ సత్తా చాటుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: