హీరోలు స్టార్ హీరోగా మారిన తర్వాత కొన్నిసార్లు వైవిధ్యమైన సినిమాలతో సాహసాలు చేయడానికి సిద్ధమవుతుంటారు.  ముఖ్యంగా డబుల్ రోల్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇలా డబుల్ రోల్ చేసిన సినిమాలు కొంతమంది హీరోలకు బాగా ప్లస్ అవుతుంటాయి. మరికొంత మంది హీరోలకు ద్విపాత్రాభినయం పేరెత్తగానే భయపడే  రేంజ్ లో ఫ్లాప్ ఇస్తుంటాయి.  అటు నాచురల్  స్టార్ నాని కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
 ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు. దర్శకుడు అవ్వబోయి హీరో అయ్యాడు.  అయినా నానీ కి అదృష్టం కలిసొచ్చింది. పట్టుకున్నదల్లా  బంగారం అయినట్లు.. నాని నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి.  తన నటనతో నాచురల్ స్టార్ గా కూడా మారిపోయాడు.  మొదటి సినిమా నుంచి పదవ సినిమా వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు.
 వరుసగా విజయాలతో ఓటమి లేని హీరోగా మారిపోయాడు. ఇక ఆ సమయంలోనే నాని  ఒక సాహసం చేయాలనుకున్నాడు. ఆ సాహసమే ద్విపాత్రాభినయం.  ఇక అనుకున్నదే తడవుగా దాని దగ్గరికి ఓ కథ వచ్చేసింది. మేర్లపాక గాంధీ వినిపించిన కథ నానికి నచ్చేసింది.
 అప్పటికే వరుసగా పది విజయాలు అందుకోవడంతో నాని పై ప్రేక్షకుల్లో భారీ రేంజిలో అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలోనే  కృష్ణార్జున యుద్ధంలో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని.  ఈ సినిమా విషయంలో నాని అంచనాలు కాస్త తలకిందులయ్యాయి. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమా  చివరికి నిరాశే మిగిల్చింది.
 సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుస్కార్ మీర్ హీరోయిన్ పాత్రల్లో నటించగా ఇక కీలక పాత్రలో బ్రాహ్మజీ  నటించారు.  ఇక సినిమాలో చిత్తూరు జిల్లాలో గ్రామానికి యువకుడు కృష్ణ.. యూరప్లో  నివసించే రాక్ స్టార్ అర్జున్..  ఈ రెండు పాత్రల్లో నాని నటించాడు.  కృష్ణ పాత్రలో చిత్తూరు స్లాంగ్ లో నానీ ఇరగదీశాడు అని చెప్పాలి.

 కానీ యూరప్ లోని అర్జున్ పాత్రే ఎక్కడో తేడా కొట్టేసింది.  ఇక రాక్ స్టార్ అర్జున్ ని ఆకర్షించిన సుబ్బలక్ష్మి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించింది..  చిత్తూరులో కృష్ణ పాత్రను లవ్ లో పడేసిన  అమ్మాయి పాత్రలో రుస్కార్ నటిస్తోంది.  ఇక  అటు చిత్తూర్ లో ఉండే కృష్ణ పాత్ర యూరోప్ లో అర్జున్ ఉండే పాత్ర ప్రియురాలిని దక్కించుకోవడం చేసే యుద్ధమే కృష్ణార్జున యుద్ధం. సినిమాలో బ్రహ్మజీ కామెడీ అదిరిపోతుంది.
 అయితే ఈ సినిమాని సరిగ్గా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.  మొదట ఈ సినిమా ఆసక్తికరంగా సాగి నప్పటికీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ఇక సెకండాఫ్ ఊహించిన విధంగా ఉండటంతో ప్రేక్షకులు తలనొప్పి వచ్చేస్తుంది.  మొత్తంగా చూసుకుంటే భారీ అంచనాల మధ్య విడుదలైన కృష్ణార్జున యుద్ధం సినిమా సక్సెస్ హీరోకి ఫ్లాప్ రుచి చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: