టాలీవుడ్ లో ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపే నటులలో ఒక నటుడు ఎన్టీఆర్. ఆయన తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటారు. ఆయన ప్రతి సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా నటన పరంగా మాత్రం ప్రేక్షకులను వందకు వందశాతం అలరింప చేస్తారు. ఆ విధంగా ఆయనలో ఉన్న నటనను మూడు రెట్లు గా మనకు చూపించిన సినిమా జై లవకుశ. 2017 లో యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహించగా తొలిసారి ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. ఈ తరం హీరోలలో ఈ తరహ పాత్రను చేసిన నటుడు ఎన్టీఆర్ మాత్రమే.

రాశిఖన్నా నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ తెలుగు తెరకు విలన్ గా పరిచయం అయ్యాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ నందమూరి రామకృష్ణ వి వినాయక్ దిల్ రాజు మొదలైన వారు హాజరయ్యారు. మొదటి క్లాప్ జూనియర్ ఎన్టీఆర్ కొట్టాడు. నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దేవుడి పటాలపై తొలి షాట్ నీ చిత్రీకరించగా దీనికి దర్శకత్వం వహించారు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్. 

తొలిరోజు 32 కోట్ల వసూళ్లను వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల షేర్ ను అందుకుంది. రెండవ రోజు 71 కోట్లు, తొలి వారంలో 94 కోట్ల ను అందుకుంది. 12 సెంటర్లలో 50 రోజుల ఘనతను సాధించిన జై లవకుశ డిస్ట్రిబ్యూటర్స్ కి మొత్తంగా 73 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది పంపిణీ దారులకు.  రెండు వారాల్లోనే 130 కోట్ల రూపాయల వరకు వసూలు సాధించి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ముగ్గులు విడిపోయిన అన్నదమ్ముల మధ్య సాగే డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వారు ముగ్గురు ఎలా కలిశారు , ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నారు అనేది సినిమా కథ. 

మరింత సమాచారం తెలుసుకోండి: