టాలీవుడ్ లో ఎలాంటి పాత్రనైనా చేసి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకునే నటుడు ఎన్టీఆర్. పాత్ర ఎలాంటిదైనా తనదైన హావా భావాలతో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు.  స్టూడెంట్ పాత్రల దగ్గర నుంచి ఫ్యాక్షనిస్టు పాత్రల దాకా అన్నిటికీ పేరుమోసిన నటుడు ఎన్టీఆర్.  తన కెరీర్లో చేసిన వైవిధ్యభరితమైన పాత్ర బ్రాహ్మణుడి పాత్ర. ఈ పాత్ర చేయడం అంత సులువైనది కాదు చాలా మంది హీరోలు ఈ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించలేక పోయారు కానీ ఎన్టీఆర్ తన నటనా కౌశలంతో పూజారిగా ప్రేక్షకులను ఎంతగానో చేశారు.

వారికి ఉండే ప్రత్యేకమైన శైలిని అవపోసన పట్టి, వారికి ఉండే వేషభాషల్లో పరకాయప్రవేశం చేసి మరి నటించాడు ఎన్టీఆర్. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమా ఆ రోజుల్లో కామెడీ పరంగా యాక్షన్ పరంగా  సూపర్ హిట్ గా నిలిచిన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. చిన్నప్పుడే విడిపోయిన ఇద్దరు రెండు సపరేట్ వాతావరణాల మధ్య పెరుగుతారు. అలా ఒకరు క్రిమినల్ గా మారగా మరొకరు బ్రాహ్మణ కుటుంబం లో పెరిగి పూజారి అవుతాడు. 

పూజారిగా బ్రహ్మానందంతో కలిసి ఎన్టీఆర్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. పొట్టచెక్కలయ్యేటి వంటి కామెడీతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించారు. ఎన్టీఆర్ ను ఒక పాత్రలో చూస్తేనే ప్రేక్షకులు ఆగలేరు. అలాంటిది రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయనను చూసేసరికి సినిమా నీ ఇండస్ట్రీ హిట్ గా మలిచేశారు. నయనతార, షీలా హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా 2009లో విడుదల కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. ఈ సినిమాలోని ఓ పాట వివాదాస్పదమవగా ఆ తర్వాత ఆ పాట లిరిక్స్ ని మార్చేసి మళ్లీ విడుదల చేశారు. ఈ సినిమా తో ఇటు దర్శకుడికి, అటు హీరో ఎన్టీఆర్ కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: