అయితే తమ పక్కన ఉన్నది చిన్న నటుడా, పెద్ద నటుడా , చిన్న వయసులో ఉన్న నటుడా, పెద్ద వయసులో ఉన్న నటుడా అన్న విషయాన్ని మాత్రం వారు అసలు పట్టించుకోవద్దు. ఆ విధంగా మన హీరోయిన్లు తమ కంటే చిన్న వయసులో ఉన్న హీరోలతో నటించిన వారిని ఇప్పుడు చూద్దాం. అక్కినేని సమంత తన కంటే రెండేళ్లు చిన్నవాడైనా విజయ్ దేవరకొండ తో మహానటి సినిమాలో నటించి మంచి జోడీ అనిపించుకున్నారు. ఆ టైంలో ఆమెకు 34 సంవత్సరాలు కాగా విజయ్ దేవరకొండ 32 సంవత్సరాలు. అలాగే తన కంటే నాలుగేళ్ల చిన్నవాడైన బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు శీను సినిమాలో నటించారు.
భూమిక తనకంటే వయసులో చిన్నవాడైనా ఎన్టీఆర్ తో సింహాద్రి, సాంబ వంటి సినిమాల్లో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా చిన్నవాడైన బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక సినిమా లో నటించారు. ఇలియానా దేవదాసు చిత్రంలో పిన్న వయస్కుడైన రామ్ సరసన నటించింది. టబు కూడా ప్రేమదేశం సినిమాలో తన కంటే చిన్నవాడైన అబ్బాస్ తో నటించింది. కాజల్ కూడా చిన్న వారైనా గణేష్ సినిమా లో హీరోగా నటించిన రామ్ తో కవచం, సీత వంటి సినిమాల్లో హీరోగా నటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో నటించింది. పూజా హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అఖిల్ అక్కినేని తో నటించారు. నమ్రత చిన్నవాడైన మహేష్ బాబు తో వంశీ సినిమాలో నటించారు. మంచు లక్ష్మి తన తమ్ముళ్లు వయస్సు తో సమానంగా ఉండే ఆది పినిశెట్టి మరియు సందీప్ కిషన్ తో కలిసి గుండెల్లో గోదారి సినిమాలో నటించారు.