ప్రతిభావంతులైన నటీ నటులు మాత్రమే ద్విపాత్రాభినయం చేయగలరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఒక్కరే యాక్టర్ అయినా.. రెండు క్యారెక్టర్లను విభిన్నంగా చూపిస్తూ.. ఆడియన్స్ ని మెప్పించడం కష్ట సాధ్యమే. కానీ న్యాచురల్ స్టార్ నాని వంటి టాలెంటెడ్ యాక్టర్లకు ద్విపాత్రాభినయం చేయడం ఎంతో సులభం. అది జెంటిల్ మేన్ సినిమాలో నిరూపితమయ్యింది. మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ జెంటిల్ మేన్ సినిమాలో గౌతమ్‌, జయరాం పాత్రలలో నాని నటించారు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా, అలాగే బడా వ్యాపారవేత్తగా విభిన్న నటనా చాతుర్యాన్ని కనబరిచి నాని వావ్ అనిపించారు.


ఈ చిత్రంలో నాని సరసన నివేదాథామస్, సురభి నటించారు. వీరిద్దరూ కూడా నాని లాగానే కనిపించే ఇద్దరు వ్యక్తులను ప్రేమిస్తారు. తర్వాత వీరిద్దరికీ అసలు నిజం ఏంటో తెలుస్తుంది. అయితే ఈ డ్రామా ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతుంది. అయితే ఇటువంటి థ్రిల్లర్ సినిమాలో ఏమాత్రం పొరపాటు చేయకుండా నాని సాలిడ్ పర్ఫామెన్స్ ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. నిజానికి నాని అన్ని సినిమాల్లోకెల్లా జెంటిల్ మేన్ చిత్రంలోనే అత్యుత్తమ నటనా ప్రదర్శన కనబరిచారు. మిగతా సినిమాల్లో ఆయన పాత్రలు అంతగా యాక్టింగ్ కి డిమాండ్ చేయలేదని చెప్పుకోవచ్చు.



సాధారణంగా నాని రెగ్యులర్ సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటారు కానీ 2016 లో మాత్రం డిఫరెంట్ జానర్ లో సినిమా చేసి ఘన విజయం సాధించారు. ఇక ఆ తర్వాత ఆయన కృష్ణార్జున యుద్ధం సినిమా లో ఒక పల్లెటూరి వ్యక్తిగా, రాక్ స్టార్ గా రెండు పాత్రలు చేశారు. ఈ సినిమా ఆశించదగ్గ స్థాయిలో హిట్ కాలేదు కానీ నాని నటనకు మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో నాని ఒక పాత్రలో క్లాస్ గానే కనిపిస్తూ మరో పాత్రలో మాస్ హీరోగా అదరగొట్టారు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: