కొన్ని సినిమాలలో హీరో పాత్ర ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంటుంది. మరి కొన్ని సినిమాలలో త్విపాత్రాభినయం కూడా చెయ్యాల్సి వస్తుంది. కథ చేసే డిమాండ్ ను బట్టి అది డ్యూయల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్ అనేది నిర్ణయించుకుంటారు. ఇందులో భాగంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో ఎన్నో డ్యూయల్ రోల్ మూవీస్, అలాగే ట్రిపుల్ రోల్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి, వారి ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఇదే డ్యూయల్ రోల్ నేపథ్యంలో వచ్చిన రవితేజ సినిమా గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. రవితేజ తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఒక వజ్రం లాంటి వాడు. ఇతనిని ఎంత సాన పెడితే అంత ప్రకాశవంతంగా మెరుస్తాడు. రవితేజలో అపారమైన ప్రతిభ దాగి ఉంది.  ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా అంటే రవితేజకి ప్రాణం. ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా స్థిరపడ్డాడు. రవితేజ ఇప్పటి వరకు చేసిన సినిమాలలో కేవలం మూడు సినిమాలాలో మాత్రమే ద్విపాత్రాభినయం చేశాడు. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన "విక్రమార్కుడు".
 ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రలలో నటించి ప్రేక్షకుల మెప్పును పొందాడు. ఒకపాత్రలో అత్తిలి సత్తిబాబు అనే దొంగగా నటించాడు. మరో పాత్రలో విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్ గా నటించాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది.  ఈ సినిమా విజయానికి కారణమయిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
* ఈ సినిమాలో రవితేజ (అత్తిలి సత్తిబాబు) మరియు బ్రహ్మానందం (అబ్బులు) మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశాయి. ఆంటీలతో చేసే కామెడీ ఫైట్ గురించి ఇప్పుడు తలచుకున్నా నవ్వాగదు.
* ముఖ్యంగా రవితేజ మ్యానరిజంగా వాడే "జింతాతా చితా చితా" అనే డైలాగ్ ప్రేక్షకుల మైండ్ లో స్టోర్ అయిపోయింది. అంతలా ఆ డైలాగ్ వర్క్ అవుట్ అయింది.

 * రవితేజ అనుష్క మధ్య వచ్చే అల్లరి, ప్రేమకు సంబంధించిన అంశాలు యూత్ ను ఆకట్టుకోవడంలో ప్లస్ అయ్యాయి. అనుష్క సినిమా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో ఆకట్టుకుంది.
 * మొదటి భాగంలో రవితేజను (అత్తిలి సత్తిబాబు) చూసి చిన్న పాప తన నాన్నగా అనుకుని చేసిన నటన ప్రతి పేరెంట్స్ కళ్ళలో కన్నీరు తెప్పించింది.  ఈ పాత్రలో చిన్నారి జీవించేసింది. ఈ పాత్ర వలన తండ్రి మరియు కూతురు మధ్య ఉన్న ఎమోషన్స్ గుర్తు చేశాయి.
 * ఇక రవితేజ చేసిన రెండవ పాత్ర విక్రమ్ సింగ్ రాథోడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా తన నటన అద్భుతం. ఈ పాత్ర మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విలన్ కి ఐపీఎస్ ఆఫీసర్ కి మధ్య వచ్చే సన్నివేశాలలో డైలాగులు విజిల్స్ కొట్టేలా ఉంటాయి. విధి నిర్వహణలో ప్రాణాలను కూడా లెక్కచేయని ఎంతోమంది పోలీసులను ఈ పాత్ర గుర్తు చేస్తుంది. ప్రకాష్ రాజు ముందు రవితేజ (విక్రమ్ సింగ్ రాథోడ్) భయం గురించే చెప్పే డైలాగ్ అయితే అద్భుతం.
 
* ఈ సినిమాలో అజయ్ (టిట్లా) పాత్ర బాగా హైలైట్ అయింది. అతని డబ్బింగ్, డైలాగులు, మేకప్, కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కటీ బాగా కుదిరాయి. ఈ పాత్రకు కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
* ఈ సినిమాలో ఎం ఎం కీరవాణి అందించిన నేపధ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసింది.

* ఇక సినిమాలో డైలాగ్స్ ది ప్రత్యేక స్థానం. అటు కామెడీ డైలాగ్స్ మరియు సీరియస్ డైలాగ్స్ ను రాయడంలో తన పనితీరును కనబరిచాడు ఎం రత్నం.

* ఇక చివరగా కెప్టెన్ అఫ్ ది షిప్ రాజమౌళి గురించి చెప్పలంటే, ఈ సినిమా మలచిన తీరు బాగుంది. మొదటి భాగం అంతా కామెడీతో నడిపించి ఆకట్టుకోగా, రెండవ భాగంలో సీరియస్ మోడ్ లో ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. రాజమౌళి అనుకున్న పాత్రకు రవితేజ సరిగ్గా సరిపోయాడు. అతని నుండి అదే విధంగా పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు.

ఈ సినిమాతో రవితేజకు ఉన్న ఫాలోయింగ్ రెట్టింపయింది. మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, ఫుల్ రన్ లో 25 కోట్ల వసూళ్లను రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: