తన కెరీర్ లో అనేక ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో నటించిన నటసింహం నందమూరి బాలకృష్ణ, వాటి ద్వారా మంచి సక్సెస్ లు అందుకున్నారు. ఇక ఆయన కెరీర్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తొలిసారిగా యాక్ట్ చేసిన సినిమా సింహా. 2010లో యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మాతగా రూపొందిన ఈ సినిమా మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
అంతకముందు సరైన సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూస్తున్న బాలకృష్ణ కు సింహా సక్సెస్ మంచి బూస్ట్ ని అందించింది. నయనతార, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ నటి కె ఆర్ విజయ ఒక ముఖ్య పాత్ర చేసారు. ఈ మూవీలో బాలయ్య రెండు పాత్రల్లోనూ అదిరిపోయే పెర్ఫార్మన్స్, డైలాగ్స్, తో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు. తప్పుడు పనులు చేస్తూ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న శత్రువులను డాక్టరైన నరసింహ ఎదిరించడం, అనంతరం విలన్ చేతుల్లో చనిపోవడం జరుగుతుంది.
అయితే కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తున్న నరసింహ తనయుడైన శ్రీమన్నారాయణ, ఆపై తన తండ్రిని హతమార్చిన శత్రువుల మీద ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అనే కథాంశంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు బోయపాటి ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ మూవీ లో నమిత తో కలిసి బాలయ్య చిందేసిన సింహమంటి చిన్నోడే సాంగ్ అప్పట్లో థియేటర్స్ ని ఊపేసింది. 2010లో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సింహా మూవీ బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దివంగత సంగీత దర్శకుడు చక్రి ఈ మూవీకి మ్యూజిక్ అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని చిన్న సమకూర్చారు. అప్పట్లో ఈ సినిమా స్టోరీ విషయమై దర్శకుడు బోయపాటి, కొరటాల శివ ల మధ్య కొంత కోల్డ్ వార్ జరిగి మీడియాలో వైరల్ అయింది ..... !!


మరింత సమాచారం తెలుసుకోండి: