కరోనా సమయంలో బాగా ఇబ్బంది పడిన రంగం ఏదైనా ఉంది అంటే అది సినీరంగం అనే చెప్పాలి. ప్రభుత్వానికి ఈ రంగం నుంచి అనేక రకాలుగా ఆదాయం వస్తున్నా సరే అత్యవసరమైన విషయం కాకపోవడంతో ఇప్పటికీ షూటింగ్ లు మొదలయ్యే విషయం మొదలు థియేటర్లను ఓపెన్ చేసే విషయం దాకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే జూలై ఒకటో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్ లు ఓపెన్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. 

కానీ ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ఎలాంటి అంచనాలు, అవకాశాలు కనిపించకపోవడంతో తాజాగా జగన్ తో సినీ పెద్దలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కేవలం థియేటర్ల ఓపెనింగ్ విషయం మాత్రమే కాక మరిన్ని అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటుంటే అనేక రాయితీలు ప్రకటించారు. ప్రస్తుత సమయంలో ఆ రాయితీలు ప్రోత్సాహకాలు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా ఉన్న దాఖలాలు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలోనే ఆ రాయితీలు ఇవ్వడమే కాక కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరిన్ని రాయితీలు ఇవ్వమని ఈ భేటీలో జగన్ ను కోరే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక విశాఖలో ఒక అతిపెద్ద స్టూడియో ఏర్పాటుకు సంబంధించి కూడా సినీ పెద్దలు జగన్ మద్దతు కోరే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాక వకీల్ సాబ్ విషయంలో టిక్కెట్ల జిఓ జారీ చేయడం ఇప్పుడు సినీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ టికెట్లు జీవోను వెనక్కి తీసుకోమని కూడా ఈ భేటీలో కోరే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: