హీరో గోపీచంద్ గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. లాస్ట్ టైమ్ "చాణక్య" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోసినిమా డిజాస్టర్ కావడంతో మరోసారి నిరాశ పడక తప్పలేదు. ఇప్పటికే వరుస ప్లాపులతో విసుగు చెందిన గోపీచంద్ ఇప్పుడు ఎలాగైనా విజయం అందుకోవాలని కసిగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్ లో రెండోసారి నటిస్తున్న ఈ హీరో "సిటీమార్" చిత్రంతో త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఎలాగైనా ప్రేక్షకులతో ఈలలు వేయించి తన ఫ్లాపుల పరంపరకు ముగింపు పలకాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని ఎంతో ఆలోచించి మరి ప్లాన్ చేస్తున్నారట.

ఇది ఇలా ఉంటె గోపి చంద్ కు సంబంధించి ఒక రూమర్ ప్రచారంలో ఉంది. "సిటీమార్" చిత్రం కనుక అనుకున్న ఫలితాన్ని అందించకపోతే ఇక ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేసి బిజినెస్ మాన్ గా సెటిల్ అవ్వాలని హీరో గోపీచంద్ యోచిస్తున్నట్లు అంటున్నారు. ఇప్పటికే  వరుస ఫ్లాపులతో విసుగు చెందిన ఈ హీరోసినిమా కూడా హిట్ కాకపోతే ఇక వేరే ప్రాజెక్ట్ ఏమీ పెట్టుకోకుండా నేరుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సిటీ మార్ చిత్రం అనంతరం యాక్షన్ హీరో గోపీచంద్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో "అలివేలు వెంకటరమణ" సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే  ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్టు కూడా "సిటీమార్" ఫలితం పైనే ఆధారపడి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ సిటీ మార్ సినిమా మాత్రం గోపీచంద్ కు మంచి సక్సెస్ అందించాలని టాప్ హీరోగా తమ అభిమాన తార ఇండస్ట్రీలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు. మరి ఈ సినిమా గోపీచంద్ కెరీర్ ను నిలబెట్టే విజయాన్ని అందిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: