సమాజంలో మేల్ డామినేషన్ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి విషయంలోనూ మేల్ డామినేషన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆడవారు మగవారి కంటే ఎక్కువ కాదు అనే అభిప్రాయం ఆడవారిలో కూడా ఉండడంతో ఈ రకమైన డామినేషన్ కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. అన్ని రంగాలలో ఉన్నట్లే సినిమా రంగంలో కూడా మేల్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 

ముఖ్యంగా హీరోలు పురుషహంకరం తో సినిమా ఇండస్ట్రీని ఏలుతు ఉంటారు. దర్శక నిర్మాతలు వారి గుప్పిట్లో ఉండడంతో వారు ఏం చెబితే అదే సాగుతూ ఉంటుంది.  కథానాయిక ఎంపిక విషయంలో, పారితోషకం విషయం లో, నిర్మాతలకు దర్శకులకు మాత్రమే సంబంధించిన విషయాల్లో కూడా వేలు పెట్టి హీరోలు తమ డామినేషన్ చూపిస్తూ ఉంటారు. కరోనా నేపథ్యంలో ఈ డామినేషన్ మరింత పెరిగింది కానీ తగ్గలేదు అని తెలుస్తోంది. ఎందుకంటే ఫలానా హీరోయిన్ కి ఎంత పారితోషకం ఇవ్వాలో కూడా వీళ్లే డిసైడ్ చేస్తున్నారట. 

బడ్జెట్ అదుపులో ఉండాలంటే తమ పారితోషికాలను తగ్గించుకోరు కానీ హీరోయిన్ ల రెమ్యునరేషన్ ఇతర విషయాల్లో ఖర్చు తగ్గించాలని వారు పెట్టే కండీషన్ గా తెలుస్తోంది. దీంతో నిర్మాతలు చేసేదేమీ లేక హీరోయిన్లను బలిపశువులుగా మారుతున్నారు. హీరోలు దర్శకులు చివరికి సంగీత దర్శకుల పారితోషకాలు పెరుగుతున్నాయి కానీ హీరోయిన్లకు మాత్రం లక్షల్లో కోత పడిపోతుంది. పదిహేనేళ్లుగా పరిశ్రమలో అగ్ర కథానాయికకు 15 లక్షలు కోసేశారు. ఆ తగ్గింపు కూడా సర్దుకుని పని చేస్తుంది. అలాగే మరో కథానాయిక కు వరుస రెండు సినిమాలకు ఒప్పించేందుకు 75 లక్షల నుంచి 50 లక్షలకు కోషేశారు. వేరొక బ్యూటీ కి రెండు వరుస ఫ్లాప్  సినిమాలను చేసినందుకు 50 లక్షల నుంచి 40 లక్షలకు కుదించారు.  మరి ఈ ధోరణి ఎప్పుడు మారుతుందో హీరోయిన్ లకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: