టాలీవుడ్ లో హీరో నాని కి ఉన్న క్రేజ్ సంగతి వేరు. ఆయన సినిమాలు అంటే ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది యూత్ లో.  తెలుగు ఇండస్ట్రీ లోనే తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు నాని. సినిమాలలో విభిన్నమైన పాత్రలను పోషించి యువతీ యువకులు మనసు దోచుకునే  నాని గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాప్ లను చవిచూస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని సినిమాల పరంగా ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్ కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన పెట్టే సోషల్ మీడియా పోస్ట్ ను బట్టి తెలుస్తోంది. 

ఇకపోతే నాచురల్ స్టార్ నాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ తన ప్రియురాలితో ప్రేమను పంచుకుంటూ వస్తుంటారు నాని. హైదరాబాదులో ఓ ప్రముఖ ఛానల్లో ఇంటర్న్ షిప్ చేసే సమయంలో అంజన తో ప్రేమాయణం మొదలు పెట్టాడట నాని.  అదే సమయంలో ఆమెను పికప్ చేసుకోవడానికి నాని ఆ ఛానల్ బయట గంటల కొద్ది పడిగాపులు కాసేవాడట. వారిద్దరికీ ఎంత ఇష్టం ఉన్నా కూడా బయటికి చెప్పుకోలేదట. తొలిరోజుల్లో ఒకరంటే ఒకరికి పడి చచ్చేంత ఇష్టం ఉంది వారిద్దరికీ. 

ఇక వీరిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో ఇరు కుటుంబాలు కలిసి వీరి వివాహాన్ని 2012లో ఎంతో ఘనంగా చేశారు. ఇప్పుడు బాగా పాపులర్ అయిన నాని అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగి నాచురల్ స్టార్ గా అత్యున్నత స్థాయికి ఎదిగాడు నాని. తన స్నేహపూర్వకమైన ఎంతో మంది మిత్రులు సంపాదించుకున్నారు ఇండస్ట్రీ లో. వీరి పండంటి కాపురానికి ఫలితంగా 2017లో అర్జున్ జన్మించాడు. ఇంతకుముందు తను నటించిన సినిమాలో నాని పోషించిన పాత్రకు అర్జున్ అని పేరు పెట్టడానికి కారణం కూడా ఇదే. ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచిన నాని టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: