టాలీవుడ్ లో సంగీతానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో దానికి ఎంత విలువ ఇస్తారో అందరికీ తెలిసిందే. సంగీత భరితమైన సినిమాలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని దాన్ని సూపర్ హిట్ చేస్తారు ప్రేక్షకులు. ఇక ప్రతి సినిమాలలోని పాటలను ఎంతగా హిట్ చేస్తారో చెప్పనవసరం లేదు. సినిమాలు ఏ విధంగా ఉన్నా కూడా అ పాటలు మాత్రం ఎంతగానో హిట్ చేస్తారు. మన టాలీవుడ్ లో ఎంతో మంది సంగీత దర్శకులు ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించారు. 

ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి  చక్రి.  ఎన్నో గొప్ప గొప్ప పాటలను ప్రేక్షకులకు అందించిన సంగీత దర్శకుడు చక్రి నుంచి క్లాస్ మాస్ రెండు రకాల పాటలు వచ్చి చాలా ఫేమస్ అయ్యాయి. చక్రి క్లాసికల్ పాటలను ఎలా అయితే ట్యూన్ చేస్తారో మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఊర మాస్ పాటలను కూడా అంతే అదే విధంగా బాణీలు సమకూరుస్తారు. పూరి జగన్నాథ్ సినిమాలకు ఎక్కువగా సంగీత దర్శకత్వం వహించిన చక్రి బాచి సినిమా ద్వారా తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు.

ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్నతమిళ అమ్మాయి, శివమణి, సత్యం, ఆంధ్రావాలా, చక్రం, నేనింతే, కృష్ణ ,దేశముదురు, దేవదాసు, సింహ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు కన్నడ తమిళ చిత్రాలకు కూడా ఆయన సంగీతం అందించగా సింహ సినిమాకి ఆయన అందించిన సంగీతానికి గాను నంది అవార్డును అందుకున్నారు. ఎంతో మంది హీరోలకు మెచ్చిన సంగీత దర్శకుడిగా ఉన్నారు చక్రి.. అయితే అయన అతిగా బరువు పెరిగి కొన్ని అనారోగ్య సమస్యలవల్ల చిన్నవయసులోనే మరణించారు. కనీ అయన స్వరపరిచిన పాటల రూపంలో అయన ఇంకా ప్రేక్షకుల్లో బ్రతికే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: