టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోల్లో ఒకరు నేచురల్ స్టార్ నాని. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోవడంతో ప్రస్తుతం వైవిధ్యభరితమైన సినిమాలను తెరకెక్కిస్తున్నారు నాని. ఆయన గత చిత్రం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి అనే సినిమాగా తెరకెక్కి  బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. థియేటర్లు క్లోజ్ అవడంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా అక్కడ ప్రేక్షకులు ఏమాత్రం మెప్పించలేకపోయింది.

దాంతో ఈసారి చేయబోయే సినిమా హిట్ కొట్టాలని తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ తో చేతులు కలిపాడు.  ఫీల్ గుడ్ మూవీ లను ఎంతో ఎంటర్టైన్ గా తెరకెక్కించే దర్శకుడు శివ నిర్వాణ ఈసారి ఫ్యామిలీ స్టొరీ ని టక్ జగదీష్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో చేస్తుండగా త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో ఈ సినిమా కూడా ఓ టీ టీ లో రిలీజ్ అవుతుంది అన్న అనుమానాలు రాగా వాటిని పటాపంచలు చేస్తూ ఈ సారి థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది అని చెప్పారు నిర్మాతలు.

అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నానికి ఈ సినిమా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటే నాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర చేస్తున్న నాని సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం.అలాగే విభిన్న చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నీ అంటే సుందారానికి సినిమా నీ కూడా సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: