టాలీవుడ్ మెగా వారసుడు రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో 'నాయక్' సినిమా కూడా ఒకటి..మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 వ సంవత్సరం జనవరి 9 సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఇక సినిమాలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం..

1. 2013 లో తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటిగా నిలిచింది.35 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 70 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అంతేకాదు దాదాపు 32 కేంద్రాల్లో 50 రోజులు, మూడు కేంద్రాల్లో వంద రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది.

2.ఈ సినిమాలో రామ్ చరణ్ మొట్టమొదటి సారి ద్విపాత్రాభినయం పోషించారు.

3.ఈ సినిమాతో రామ్ చరణ్ హిందీ సాటిలైట్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.నాయక్ సినిమా హిందీ సాటిలైట్ రైట్స్ ఏకంగా 35 మిలియన్ డాలర్లకు(3.5కోట్లు) అమ్ముడు పోయాయి.

4.ఈ సినిమాను ఒకే పేరుతో తమిళం మరియు మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేయగా.. అక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది.

5.ఇక రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ఇది రెండవ బ్లాక్ బస్టర్ సినిమా కావడం విశేషం. గతంలో వీరి కాంబోలో 'మగధీర' సినిమా సంచలన విజయం అందుకుంది.

6.ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమా నుండి "శుభలేఖ రాసుకున్న" అనే పాటను ఈ సినిమా కోసం రీమేక్ చేశారు.

7.ఈ సినిమాలోని కొన్ని పాటలను ఐస్లాండ్ మరియు  స్లోవేనియాలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు.స్లోవేనియాలో చిత్రీకరించిన మొట్టమొదటి తెలుగు భాషా చిత్రం ఇది ఇదే కావడం విశేషం.

8.ఇక ఈ సినిమాలోని  ఐటమ్ సాంగ్ కి హీరోయిన్ శృతిహాసన్ ని మొదట ఎంపిక చేసారట. కానీ ఆ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయడానికి నిరాకరించింది. చివరికి, నటి చార్మి కౌర్ ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నటించారు.

9.ఇక అప్పట్లో ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ పెద్ద వివాదం చెలరేగింది.గిరిజన్ స్టూడెంట్ అసోసియేషన్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా టైటిల్ చుట్టూ ఒక వివాదం నెలకొంది, 'నాయక్' అనే పదాన్ని లంబాడి వర్గానికి చెందిన వ్యక్తులు ప్రత్యేకంగా ఉపయోగం కోసం రిజర్వు చేశారని మరియు సినిమా టైటిల్‌లో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాన్ని సెన్సార్ బోర్డు ముందు సమర్పించారు మరియు టైటిల్ ఏ కుల భావాలతోనూ సంబంధం లేదని భావించినందున టైటిల్ మార్చకూడదని బోర్డు నిర్ణయించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: