ఈటీవీలో సక్సెస్ ఫుల్ రియాలిటీ షోగా కొనసాగుతున్న జబర్దస్త్ షో సూపర్ పాపులర్ అయ్యింది. ఆ షోలో చేస్తున్న కమెడియన్స్ అంతా సినిమాల్లో కూడా బిజీ అవుతున్నారు. ఆ కామెడీ షోని ఒక వర్గం ప్రేక్షకులు తిడుతున్నా సరే కొందరు మాత్రం జబర్దస్త్ ను లాఫింగ్ థెరపీగా ప్రయోగిస్తున్నారు. ఇదిలాఉంటే జబర్దస్త్ తో క్రేజ్ తెచ్చుకున్న వారందరిని ఆ షోతోనే కాకుండా మిగతా షోలకు వాడేస్తున్నారు ఈటివి నిర్వాహకులు. ఇప్పటికే ఏదైనా పండుగ వచ్చింది అంటే జబర్దస్త్ వాళ్ల సందడి వారు చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ గ్యాంగ్ తోనే మరో రెండు షోలు ప్లాన్ చేశారు.

అందులో ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ మరొకటి రెచ్చిపోదాం బ్రదర్. ఈటివి ప్లస్ లో పటాస్ తర్వాత అంతగా ఆకట్టుకునే ప్రోగ్రాం మరొకటి రాలేదు. అందుకే ఇప్పుడు ఈటివి ప్లస్ కోసం జబర్దస్త్ షో స్కిట్స్ నే అక్కడ కూడా వెరైటీగా ప్రెజెంట్ చేస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ తోనే శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఏదో ఇక కాన్సెప్ట్ తీసుకుని అందరి కమెడియన్స్ చేత కామెడీ చేయిస్తున్నారు. ఇక రెచ్చిపోదాం బ్రదర్ లో మాత్రం జబర్దస్త్ కమెడియన్స్ తో పాటుగా యూట్యూబ్ లో పాపులర్ అయిన కొందరిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేస్తున్నారు.

ఫైనల్ గా మల్లెమాల వారు జబర్దస్త్ కమెడియన్స్ కు ఏవిధంగా పేమెంట్స్ ఇస్తారో తెలియదు కాని వారితో రకరకాల షోలతో ఆడియెన్స్ ను మాత్రం మెప్పిస్తున్నారు. వీటికి పోటీగా స్టార్ మా కూడా స్టార్ట్ మ్యూజిక్ అని.. కామెడీ స్టార్స్ అని షోలు చేస్తున్నా ఎంతైనా జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ తో ఈటివి షోలకే ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. వీళ్ల ఫాం చూస్తుంటే జబర్దస్త్ కమెడియన్ లు మరో ఐదారేళ్లు ఇదే హవా కొనసాగించేలా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: