విక్టరీ వెంకటేష్ హీరోగా ఎన్. శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జయం మనదేరా. ఈ సినిమాలో మహదేవ నాయుడు, రుద్రమ నాయుడు అలియాస్ అభిరాం పాత్రలో వెంకటేష్ నటన అద్భుతంగా ఉంటుంది. సీరియస్ యాక్షన్ సినిమాలు చేసే కొందరు హీరోలకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలు పెద్దగా సూట్ అవ్వవు. కాని వెంకటేష్ అలా కాదు ఆయన ఎలాంటి సినిమా అయినా చేస్తారు.. చేయగలరు. ఫ్యామిలీ మొత్తం చూసే కలిసుందారా సినిమాలు చేయగలరు.. గణేష్ లాంటి సీరియస్ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేయగలరు.

ఈ క్రమంలోనే వెంకటేష్ నటించిన సినిమా జయం మనదేరా. వెంకటేష్ డ్యుయల్ రోల్ చేసిన ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మహదేవ నాయుడు పాత్రలో వెంకటేష్ నటనకు వెంకీ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా సూపర్ అనేలా చేశాడు. భిరాం పాత్రలో మోడ్రెన్ లుక్ తో అలరించగా మహదేవ నాయుడు పాత్రలో భారీ ఆహర్యంతో.. అంతే భారీ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించారు వెంకటేష్. టాలీవుడ్ డ్యుయల్ రోల్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకుంటే వెంకటేష్ కెరియర్ లో జయం మనదేరా ఒకటు.

ఒకటి సీరియస్ యాక్షన్.. మరోటి జోవియల్ క్యారక్టర్ రెండు పాత్రల్లో వెంకటేష్ అదరగొట్టాడని చెప్పొచ్చు. జయం మనదేరా సినిమాలో అందరికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా నచ్చినా ఫాట్ హాఫ్ లో వెంకటేష్ హీరోయిన్ సౌందర్యతో చేసే చిలిపి అల్లరి కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేష్ సినిమా బెస్ట్ మూవీస్ లో టాప్ 10 లో జయం మనదేరా కూడా ఒకటి ఉంటుందని చెప్పొచ్చు. అందుకే వెంకటేష్ ఎంటర్టైనర్ సినిమాలు చేసినా అప్పుడప్పుడు సీరియస్ సబ్జెక్ట్ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: