కరోనా మహమ్మారి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఎంత అతలా కుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలు వాయిదా పడ్డాయి. సినిమా షూటింగులకు అన్ని సెట్ చేసుకున్న సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. దాంతో థియేటర్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయో అని చూడడం తప్ప చేయడానికి ఏం లేదు. కరోనా మొదటి దశ సమయంలో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో ప్రారంభమైన సమయంలో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు భయపడ్డారు.

అసలు జనాలు థియేటర్ల వైపు వస్తారో రారో అని ఆందోళన చెందారు. అయితే సాయి ధరంతేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ని నిర్మాతలు ధైర్యం చేసి విడుదల చేయగా ఆ సినిమానీ ఘనవిజయం చేశారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. రెండవ దశ కరోనా ముగింపు దశకు రావడంతో థియేటర్లు ఓపెన్ అవుతాయి అని వార్తలు ప్రచారం అవుతున్నాయి. జూలై మొదటి వారంలో థియేటర్ ఓపెన్ అవ్వడం ఖాయం అంటున్నారు. దీంతో సినీ నిర్మాతలు తమ తమ సినిమలను ముస్తాబు చేసుకుంటున్నారు. 50 శాతం అక్యుపెన్సి తో థియేటర్ లను ప్రారంభించడానికి అనుమతించే అవకాశం ఉంది. 

అయితే ఈ ఏడాది థియేటర్లు తెరచుగానే విడుదలయ్యే మొట్టమొదటి సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా అని చెబుతున్నారు. నిజానికి ఏప్రిల్ 16న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా విజృంభించడం తో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దాంతో థియేటర్ లు  ఓపెన్ అయితే మొట్టమొదట విడుదలయ్యే సినిమా ఇదే అనిపిస్తుంది. మొదటి దశలో సాయి ధరంతేజ్ రిస్క్ చేస్తే రెండోదశలో నాగచైతన్య రిస్క్ చేసి తన సినిమాను విడుదల చేస్తున్నాడు. ఆ సినిమా లాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: