కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరో ఇలా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు గిరిబాబు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు గా ఉన్న గిరిబాబు కు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడి పేరు రఘు బాబు కాగా చిన్న కుమా రుడి బోసు బాబు.  పెద్ద కుమారుడు రఘుబాబు వెండితెరపై కమెడియన్ గా రాణిస్తూ కామెడీ విలన్ గా టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. 

తెలుగులో వస్తున్న పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో హాస్యనటుడిగా రఘుబాబు అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ఉంటున్నారు. ఇప్పటికే అనేక సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే రఘు బాబు కి ఒక తమ్ముడు ఉన్నాడని అతను సినీ పరిశ్రమలో హీరోగా పరిచయమయ్యాడు చాలా తక్కువ మందికి తెలుసు. అప్పట్లో హీరోగా వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోవాలని గిరిబాబు చిన్న కుమారుడు బోసు బాబు నీ ఇంద్రజిత్తు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కానీ నెల రోజులు గడిచిన హిట్ టాక్ సంపాదించుకోలేక పోయింది. అయితే ఆ సమయంలో చిరంజీవి హీరోగా నటించిన కొదమ సింహం సినిమా కూడా విడుదల కావడంతో ఈ సినిమా నీ సగం ధరకే బయ్యర్ లు కొనుగోలు చేశారు. దాంతో గిరిబాబు కు చాలా నష్టం వాటిల్లింది. బోసు బాబు కు కూడా సినిమాలపై విశ్వాసం కోల్పోయారు. ఆ తర్వాత హిందీలో స్టంట్ మ్యాన్ గా తెలుగులో చమ్మచక్క సినిమాలో కథానాయకుడిగా కనిపించారు.  కానీ ఈ సినిమాలేవీ ఆయన్ని నిలబెట్టలేకపోయాయి. దర్శకుడిగా ప్రొడ్యూసర్ గా గిరిబాబు ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. అంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కొడుకై ఉండి వెండితెరపై రాణించలేకపోయాడు బోసు బాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి: