అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'లవ్ స్టొరీ'..టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఏప్రిల్ 16 నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది.అయితే తాజాగా దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.అంతేకాదు కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోయే సినిమా కూడా ఇదే అంటూ వార్తలు వచ్చాయి.ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా విడుదలపై నిర్మాత సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చాడు.

సినిమా విడుదల గురించి నిర్మాత సునీల్ మాట్లాడుతూ.."తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ.. నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత మాత్రమే ఎవరైనా సినిమా రిలీజ్ విషయం ఆలోచిస్తారని.. మూడు షోలతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. అలానే తెలంగాణతో పాటు ఏపీలో కరోనా పరిస్థితులు థియేటర్లు తెరవడానికి అనుకూలంగా ఉండాలి కదా.. అని చెప్పారు.

అయితే ఇప్పుడున్న ట్రెండ్ ని చూస్తూంటే జూలై రెండో వారానికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ థియేటర్లు తెరవటానికి ఫర్మిషన్స్ లభించినా.. నైట్ కర్ఫ్యూ తీసేసిన తరువాతే కొత్త సినిమాలు రిలీజ్ లు ఉంటాయని స్పష్టం చేశారు. ఏది ఏమైనా 'లవ్ స్టోరీ' సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.ఇక పవన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదలై ప్రేక్షకులల్లో మంచి రెస్పాన్స్ ని అందుకుంది.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమాకి సంబంధించిన కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు చిత్ర యూనిట్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: