టాలీవుడ్ యువ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గత ఏడాది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అలవైకుంఠపురములో మూవీ కి అందించిన సాంగ్స్ ఏకంగా జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని సామజవరగమనా, బుట్ట బొమ్మ, రాములో రాముల సాంగ్స్ అయితే యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని యూట్యూబ్ లో ఇప్పటికీ వందల మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.
ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో థమన్ కి మరింత క్రేజ్ లభించింది. దానితో థమన్ కు ప్రస్తుతం వరుసగా అనేక భారీ సినిమా ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం తమన్ మహేష్ తో సర్కారు వారి పాట, మహేష్ - త్రివిక్రమ్ మూవీ, బాలయ్య అఖండ, బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా, పవన్ కళ్యాణ్ తో అయ్యప్పనుం కోషియం రీమేక్, టక్ జగదీశ్, సహా మరికొన్ని సినిమాలు దక్కించుకున్నాడు. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ ఏడాది ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో తన బృదంతో కలిసి అమెరికాలో అతి పెద్ద లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించనున్నారు థమన్.

హంసిని ఎంటర్టైన్మెంట్ వారు నిర్వహించనున్న ఈ ఈవెంట్ లో థమన్ తో పాటు డ్రమ్మర్ శివమణి, నటి కం సింగర్ అయిన ఆండ్రియా, సింగర్స్ హారికా నారాయణ్, శృతిరంజని, శ్రీకృష్ణ, మనీషా ఎర్రాబత్తిని సహా మరికొందరు సింగర్స్ పాల్గొననున్నారు. ఎంతో భారీ ఎత్తున నిర్వహించనున్న ఈ వేడుకను జయప్రదం చేయాలని అమెరికా లోని ప్రేక్షకాభిమానులని కోరుతూ కొద్దిసేపటి క్రితం థమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసారు. కాగా ఈ కాన్సర్ట్ కు అల అమెరికాపురములో అని పేరు నిర్ణయించారు. మరి అల మూవీతో భారీ సక్సెస్ కొట్టిన థమన్, ఈ అల కన్సర్ట్ తో ఏ స్థాయి క్రేజ్ దక్కించుకుంటారో చూడాలి .... !!      


మరింత సమాచారం తెలుసుకోండి: