మాములుగా సినిమా మీద ఓ ఇంప్రెషన్ కలగాలంటే టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు టైటిల్ చూసి సినిమాకు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఈ టైటిల్స్ తో పాటుగా ఉప శీర్షికలు అదేనండి ట్యాగ్ లైన్స్ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి సినిమా టైటిల్స్ కన్నా ఈ ట్యాగ్ లైన్స్ ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటుంది. ఇంతకీ తెలుగులో ఆసక్తి కరంగా ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయిన కొన్ని సినిమాల పేర్లు వాటి ట్యాగ్ లైన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా గుర్తుంది కదా.. మర్చిపోయే సినిమా కాదు కదా అది. ఆర్య అనగానే అందరు ఫీల్ మై లవ్ అనేస్తారు. అది ఆ సినిమా ట్యాగ్ లైన్.. సినిమా టైటిల్ తో పాటు ఆ ట్యాగ్ లైన్ కూడా చాలా పాపులర్ అయ్యింది. అదే క్రమంలో పూరీ, రవితేజ కాంబోలో వచ్చిన ఇడియట్ సినిమా ట్యాగ్ లైన్ కూడా ప్రేక్షకుల నోట్లో బాగా నానింది. ఇడియట్చంటి గాడి ప్రేమకథ అని అందరు అనేశారు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఆనంద్ సినిమాకు ఉప శీర్షికగా మంచి కాఫీ లాంటి సినిమా అని పెట్టారు. సినిమ కూడా అలానే ఉంటుంది.

ఇలానే కొన్ని ఆసక్తికరమైన టైటిల్స్ వాటి ట్యాగ్ లైన్స్ చూస్తే జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును. తీన్ మార్.. సెలబ్రేషన్స్ ఆఫ్ లవ్. సన్నాఫ్ సత్యమూర్తికి ట్యాగ్ లైన్ విలువలే ఆస్తి. నేను లోకల్ కు ఆటిట్యూడ్ ఈజ్ ఎవరీ థింగ్. బిచ్చగాడు.. ద బిలీనియర్. నిజం.. ఇట్స్ ఏ లై. మన్మథుడు.. హి హేట్స్ ఉమెన్. ఇలా సినిమా టైటిల్స్ తో పాటుగా ట్యాగ్ లైన్స్ ను కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునేలా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: