కరోనా వల్ల థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు.. ఎప్పుడు మూసేస్తారో తెలియదు అన్నట్టు పరిస్థితి ఉంది. అందుకే ఈమధ్య అందరు ఓటిటిల్లో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్ రిలీజ్ కు వెయిట్ చేయలేని దర్శక నిర్మాతలు కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఓటిటి ఫ్లాట్ ఫాం లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్స్ట్, జీ 5, కొత్తగా ఆర్జీవీ స్పార్క్ ఓటిటిలు మార్కెట్ లో ఉన్నాయి. వీటికి ఒకదాని మీద మరొకటి పోటీ పడుతూ సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తున్నారు. ఒరిజినల్ కంటెంట్ తో సొంతంగా ఇండిపెండెంట్ సీరీస్ లను ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు కొత్తగా సోనీ నుండి మరో ఓటిటి వస్తుందని తెలుస్తుంది. సోనీ లైవ్ పేరుతో ఓ సరికొత్త ఓటిటి ఫ్లాట్ ఫాం ఏర్పరుస్తున్నారని తెలుస్తుంది. సోనీ దగ్గర ఉన్న ఒరిజినల్ కంటెంట్ మొత్తం ఈ ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కేవలం హిందీలోనే కాదు సౌత్ భషల్లో కూడా ఈ ఓటిటిని విస్తరించాలని చూస్తున్నారు. అందుకే తమిళ భాషకి హెడ్ గా మీడియా పర్సన్, ప్రొడ్యూసర్ ధనుంజయ్ ను హెడ్ గా పెట్టారట. తెలుగులో సోనీ లైవ్ కు నిర్మాత మధుర శ్రీధర్ ను హెడ్ గా తీసుకున్నారని తెలుస్తుంది. సోనీ లైవ్ నుండి కూడా తెలుగు సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఓటిటి ఫ్లాట్ ఫాం లు వచ్చాక కొత్త వారికి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. తమ దగ్గర సరైన కంటెనంట్ ఉంటే చాలు డిజిటల్ ఫ్లాట్ ఫాం లో అవకాశం దక్కినట్టే. ఇప్పటికే పోటాపోటీగా ఉన్న ఈ డిజిటల్ ఓటిటి రంగంలో సోనీ లైవ్ ఎలాంటి కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. సోనీ లైవ్ ను తెలుగులో కూడా గ్రాండ్ గానే లాంచ్ చేసే ఆలోచనల్లో ఉన్నారని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: