కమలహాసన్ వారసు రాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ఏక్షణంలో ఎలా ఉంటుందో ఆమెకే తెలియదు. నటి గాయని డాన్సర్ కవయిత్రి ఇలా ఎన్నో టాలెంట్స్ ఆమెలో ఉన్నాయి. ఇన్ని టాలెంట్స్ మరొక హీరోయిన్ కి ఉండి ఉంటే ఈపాటికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుని ఉండేది అయితే శృతి హాసన్ తీరువేరు.


‘శ్రీమంతుడు’ లాంటి భారీ హిట్ లో నటించాక ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని వదులుకుని ఇంగ్లాండ్ లోని ఒక ధియేటర్ ఆర్టిస్ట్ తో సహజీవనం చేసింది. వారిద్దరి ప్రేమ పెళ్ళి వరకు వచ్చిన తరువాత ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పి మళ్ళీ సిమాల వైపు యూటర్న్ తీసుకుంది.


‘క్రాక్’ ‘వకీల్ సాబ్’ మూవీలు తరువాత ఆమెకు ఏకంగా ప్రభాస్ పక్కన ‘సలార్’ మూవీలో అవకాశం రావడంతో ఆమె కెరియర్ మళ్ళీ ట్రాక్ లోకి రావడం ప్రారంభించింది. అయితే మళ్ళీ శృతి మరొకరి ప్రేమలో పడటమే కాకుండా మళ్ళీ అతడితో సహజీవనం చేస్తోంది. సంతను హజారిక అనే పెయింటర్ తో ప్రస్తుతం సహజీవనం చేస్తున్న శృతి హాసన్ అతడి పెయింట్ ల మధ్య గ్లామర్ ఒలకపోస్తూ కొన్ని ఫోటోలు తీయించుకుని తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు సంతను ప్రతిభ అందరికీ తెలిసి పోయింది.


ఈమధ్యనే శృతి ముంబాయిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక విలాస వంతమైన అపార్ట్ మెంట్ ను కొనుక్కుని అక్కడ సంతను తో కలిసి జీవిస్తోంది. కొత్త అపార్ట్మెంట్ కొనుక్కున్న తరువాత కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయి షూటింగ్ లు ఆగిపోవడంతో ఖాళీ బాగా దొరకడంతో ఇలా తన కొత్త ప్రియుడి టాలెంట్ ను అందరికీ తెలిసేలా చేస్తూ బిజీగా ఉంది. ‘సలార్’ మూవీలో ప్రభాస్ పక్కన శృతి ఎంపిక కావడంతో ‘వకీల్ సాబ్’ లో ఆమె లుక్ చూసి ఇలా ఎటువంటి గ్లామర్ లేకుండా ప్రభాస్ పక్కన నటిస్తుందా అంటూ అభిమానులు ఖంగుతింటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: