సోనూ సూద్ ఈ పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగిపోతుంది. ఈయన చేస్తున్న సేవలు అతీతం. కరోనా సమయంలో వలస కూలీలకు అందించిన సేవలతో రియల్ హీరో అయ్యాడు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సాయం కోరితే కాదనకుండా క్షణాల్లో తోచిన సాయాన్ని అందించేవాడు. విద్యార్థులకు, చిన్నారులకు, యువతులకు ఎలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఈయన సాయాన్ని పొందారు. ఈ చేస్తున్న సేవలకు గాను మెచ్చి చాలా మంది విరాలను అందించడానికి ముందుకు వస్తున్నారు.


కరోనా రోగులకు మాత్రం సోనూ సూద్ దేవుడనే చెప్పాలి. ఆక్సిజన్ కొరతను తీర్చాడు. అలాగే ఉచితంగా వ్యాక్సిన్ ను కూడా అందించాడు. ఇప్పటికే అందిస్తున్నాడు. ఇకపోతే కరోనా రోగుల కు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా అన్నీ చర్యలను తీసుకున్నాడు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కూడా ఇదే రీతిలో బీడీఆర్ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితుల కు వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ లు ప్రభుత్వం చేతిలో ఉండాలి. కానీ ఇలా ప్రయివేట్ వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్లాయి.. అంటూ ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది.


సిద్ధిఖీ బీడీఆర్ ఫౌండేషన్ ద్వారా రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు వితరణ చేశారని, ఇక సోనూ సూద్ లైఫ్ లైన్ మెడికేర్ ఆసుపత్రి లోని దుకాణాల ద్వారా ఈ ఇంజక్షన్లను పొందినట్లు లాయర్ కోర్టుకు వివరించారు. ఇకపోతే ఎమ్మెల్యే కు వచ్చిన వ్యాక్సిన్ లను ప్రజలకు వినియోగించకుండా ఇలా ఫౌండేషన్ కు పంపించడమేంటి? అంటూ మండిపడింది. సాయం పేరుతో వీరిద్దరూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ధర్మశాసనం పేర్కొంది. వీరు చేస్తున్న వ్యవహారం పై సీరియస్ గా స్పందించాలని విజ్ఞప్తి చేసారు.  ఈ విషయం పై నెటిజన్లు  రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. ఇది కాస్త వైరల్ అయ్యింది..వీరిని ఇలా వదిలేస్తే వేరేవాళ్లు తయారవుతారని హెచ్చరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: