స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న ఓ అమ్మడు తనకు సినిమా అవకాశాలు వస్తున్నా సరే చేసే ఇంట్రెస్ట్ లేదని అంటుంది. స్టార్ మా, ఈటివి సీరియల్స్ లో సూపర్ పాపులర్ అయ్యింది నవ్య. ఆమె చేస్తున్న సీరియల్స్ హిట్ అవుతుండటంతో ఆమెకి అవకాశాలు ఎక్కువయ్యాయి. వరుస సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈ అమ్మడికి సినిమా ఛాన్సులు కూడా వస్తున్నాయట. మొదట్లో హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ లాంటివి వచ్చినా లైట్ తీసుకుందట నవ్య. ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా కూడా ఛాన్సులు ఇస్తామని అంటున్నారట.

అయితే అమ్మడు మాత్రం ప్రస్తుతం తను సీరియల్స్ తో బిజీగా ఉన్నానని సినిమాల ఆలోచన లేదని అంటుంది. ఎంత సీరియల్స్ తీసినా సినిమా హీరోయిన్ కు వచ్చే క్రేజ్, పాపులారిటీ వేరు. సీరియల్ యాక్ట్రెస్ గానే కొనసాగుతా అంటూ చెబుతుంది నవ్య. దీనికి మరో కారణం ఏంటంటే సీరియల్ హీరో రవి కృష్ణని ఆమె పెళ్లి చేసుకోబోతుందని టాక్. ఈమధ్య ఎక్కడ చూసినా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఇద్దరు కలిసి ఆమె కథ సీరియల్ చేయడంతో ఆ టైం లో అభిప్రాయాలు కలిసినట్టు ఉన్నాయి.

స్టార్ మాలో ఓ ప్రోగ్రాం లో వీరి పెళ్లి కార్యక్రమం కూడా చేశారు. అదంతా షో కోసమే అనుకున్నా రవికృష్ణ, నవ్య ల మధ్య సీరియస్ రిలేషన్ ఉందని అందరు అనుకుంటున్నారు. నవ్య సినిమాలు ఒప్పుకోకపోవడానికి అది కూడా ఒక కారణం అని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సినిమా అవకాశాలు వస్తున్నా చేయనని అంటున్న నవ్య మనసు మార్చుకుని సినిమాల్లో కూడా నటిచాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఇప్పటికే నవ్యకు వచ్చిన ఒకటి రెండు సినిమా ఛాన్సులు రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. మరి ఫ్యూచర్ లో అయినా అమ్మడు మనసు మార్చుకుని సినిమాలు చేస్తే బాగుంటుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: