స్టార్ సినిమా హిట్ మంత్రం ఏంటి అన్నది ఒక్క మాటలో చెప్పడం కష్టం. ఆ స్టార్ అభిమానుల అంచనాలను అందుకోవడమే కాకుండా సగటి సినీ ప్రేక్షకుడిని మెప్పించాలి అప్పుడు కాని ఆ సినిమా హిట్ అవ్వదు. అసలు స్టార్ సినిమాకు కథ ఎందుకు హీరో ఎలివేషన్స్.. ఓ రొటీన్ రివెంజ్ కథ ఉంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు. స్టార్ హీరో హిట్ సినిమాకు కావాల్సిన సమీకరణాలు ఇవే అయినా కూడా వాటిలో కూడా అన్ని అనుకున్నట్టు జరిగితేనే సినిమా హిట్ లేదంటే ఆడియెన్స్ పెదవి విరవక తప్పదు.

కన్నడ సినిమా అయిన కే.జి.ఎఫ్ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ మూవీగా వచ్చింది. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండదు కాని ఆ సినిమా మాస్ ఆడియెన్స్ ను అలరించడం లో సక్సెస్ అయ్యింది. సెంటిమెంట్, ఎమోషన్, మాస్ అంశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే చాలు సినిమా ఆడియెన్స్ ను రీచ్ అయినట్టే. దానికి 100 శాతం పర్ఫెక్ట్ అనిపించుకుంది కె.జి.ఎఫ్ మూవీ. అసలు తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని హీరోతో కె.జి.ఎఫ్ సినిమా తెలుగునాట సంచలనాలు సృష్టించింది. ఆ సినిమాలో ఎలివేషన్ సీన్స్ మరే తెలుగు హీరో అయినా అది డబుల్ రికార్డులు సృష్టించేది అనుకున్నారు.

ఇప్పుడు అదే అంచనాలతో కె.జి.ఎఫ్ పార్ట్ 2 వస్తుంది. ఈమధ్య వదిలిన టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు ప్రశాంత్ నీల్. అభిమాన నటుడిని ఆకాశం అంత ఎత్తున చూపించడం కొంతమంది దర్శకుల స్టైల్. దానికి తోడు కొద్దిగా కథ బాగుంటే చాలు సినిమా హిట్ అన్నట్టే. అయితే కె.జి.ఎఫ్ సీక్వెన్స్ లో హీరో ఎలివేషన్స్ మాత్రమే కాదు మంచి కథ కూడా తోడైంది అందుకే సినిమా ఆ స్థాయిలో అంచనాలు ఏర్పరచింది. పార్ట్ 1 లానే పార్ట్ 2 కూడా సంచలనాలు సృష్టించడం సిద్ధమని ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారంటే ఆ సినిమా కలిగించిన ఇంప్యాకే ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: