సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. ఎందుకంటే హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేరు కాబట్టి. కొంతమంది అవకాశాలు రాక సినీ ఇండస్ట్రీకి దూరమైతే, మరికొంతమంది పెళ్లిళ్లు చేసుకొని మరీ సినీ ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అలా తక్కువ కాలంలోనే సినీ కెరియర్ ను  ముగించుకుంటున్నారు. కానీ హీరోలు మాత్రం అలాకాదు..ఒక సినిమా సక్సెస్ అయిన మరో సినిమా సక్సెస్ కాకపోయినా అలా సినిమాలు చేసుకుంటూనే పోతారు . కానీ హీరోయిన్ ల సినీ కెరీర్ లో  మాత్రం 1,2 సినిమా ఫ్లాప్ అయితే.. ఇక అవకాశాలు కూడా తగ్గుతూ వస్తాయి. ఇక పోను పోనూ  ఆమె గురించి పట్టించుకోవడం కూడా మానేస్తారు. ఇక  ఎక్కువ కాలం హీరోయిన్లు స్టార్ గా ఉండాలి అంటే చాలా కష్టం. అయితే కొందరు హీరోయిన్లు ఒకే ఒక్క  సినిమా  చేసి కనుమరుగైన వారు చాలామందే ఉన్నారు.అయితే  వారెవరో చూద్దాం.



1). మాళవిక శర్మ:
హీరో రవితేజతో కలిసి నేల టికెట్ సినిమాలో  నటించిన మాళవిక శర్మ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈమెకు అవకాశాలు రాకుండా పోయాయి. కానీ రామ్ హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మ, ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
2). నిఖిషా పటేల్:
పవన్ కళ్యాణ్ తో కలిసి కొమరం పులి సినిమాతో జత కట్టిన ఈమె తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ తో "ఓం" సినిమాలో నటించినా, ఆ సినిమా కూడా పెద్దగా ఎవరికీ పరిచయం లేకుండా పోయింది. ఇక  తెలుగు ఇండస్ట్రీలో ఈమె ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోయింది.
3) ముస్కాన్ సేతి:
నందమూరి బాలకృష్ణ నటించిన పైసా వసూల్ చిత్రంలో నటించిన ఈమె, ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ ను చవి చూడడంతో ఈమెకు సినిమా ఆఫర్లు రావడం లేదు. ఇక రాగల 24 గంటల్లో అనే థ్రిల్లర్ సినిమాలో నటించినా అది కూడా ఫ్లాప్ టాక్ తో నిలిచిపోయింది.
4) అధితి ఆర్య:
డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్ తో చేసిన సినిమా "ఇజం" .ఇందులో కథానాయికగా నటించింది అధితి ఆర్య. తన నటనతో అందరిని బాగా ఆకట్టుకున్న. ఈ భామ, ఈ సినిమా కమర్షియల్ గా నిలిచిపోయింది. దీంతో ఈమె కేవలం ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.5) షహీన్ :
షహీన్ కూడా అలాంటి హీరోయిన్లలో ఒకరు. ఈమె చిరునవ్వుతో సినిమాలో నటించి కనుమరుగైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: