టాలీవుడ్ లో ఎందరో హీరోలు ఉన్నారు. ఇక బడా హీరోల కాంపౌండ్లలో ఎందరో హీరోలు ఉన్నారు. మరో వైపు కొత్త హీరోలు వస్తూనే ఉన్నారు. ఇలా అందరికీ లెక్క కలిపితే కచ్చితంగా అర్ధ సెంచరీకి తక్కువ లేకుండా ఉంటారేమో.

మరి ఇంతమంది హీరోలు ఉంటే కోలీవుడ్ మీద దృష్టి ఎందుకు పెట్టాల్సి వస్తోంది అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఉంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా కూడా వరసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. కరోనా దెబ్బకు ఒక్కొక్కరి చేతిలో ఉన్న సినిమాలు ఫినిష్ చేయాలంటే కచ్చితంగా రెండు మూడేళ్ళు పట్టే అవకాశం ఉంది. దీంతో ఇపుడు నిర్మాతలకు కాల్షీట్లు దొరకడం లేదుట.

మరి టాలీవుడ్ హీరోల కాల్షీట్లు దొరకపోతే ఏం చేస్తారు. పొరుగుకు వెళ్ళి అక్కడ హీరోలను ఇక్కడకు తెస్తున్నారు. కోలీవుడ్ నుంచి అలా ఇద్దరు హీరోలను టాలీవుడ్ కి తెచ్చి సినిమాలు తీస్తున్నారు. వారిలో ఒకరు సూర్య అయితే మరొకరు విజయ్. ఈ ఇద్దరూ తమిళంలో సూపర్ స్టార్లే. తెలుగులో వీరి డబ్బింగ్ సినిమాలు బాగా ఆడతాయి. దాంతో డైరెక్ట్ గా తెలుగు లో వీరితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీ అయిపోయారు.

వీరే కాదు, మరికొందరు ఇతర భాషా హీరోలతో కూడా సినిమాలు తీసేందుకు ఇపుడు టాలీవుడ్ మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. కేజీఎఫ్ తో భారీ హిట్ కొట్టి టూ తో వస్తున్న కన్నడ హీరో యశ్ తో కూడా తెలుగులో సినిమాలు తీయాలని అటు నిర్మాతలు ఇటు దర్శకులు ఉత్సాహపడుతున్నారు. మొత్తానికి కరోనా తరువాత టాలీవుడ్ లో సీన్ మారిపోయేలా ఉంది. ఇంతకాలం పరాయి భాషా హీరోయిన్లనే చూసిన టాలీవుడ్ ఇపుడు పరాయి హీరోలను కూడా తెచ్చేస్తోంది. మరి టాలీవుడ్ గడ్డ మీద వీరంతా గట్టిగా నిలబడితే హెవీ కాంపిటేషన్ గానే కధ మారుతుంది కూడా. చూడాలి ఈ మార్పు దేనికి సంకేతమో.


మరింత సమాచారం తెలుసుకోండి: