తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా చేస్తూ మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్. ఆ తర్వాత హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలరించింది. స్టార్ హీరో తనయురాలిగా వరలక్ష్మి స్టార్ క్రేజ్ తెచ్చుకోగా తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఆమె అవకాశాలు తెచ్చుకుంటున్నారు. సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగులో మొదటి ఆఫర్ అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ పాత్రలో అదరగొట్టారు. సినిమాలో విలన్ కు సపోర్టర్ గా జయమ్మ పాత్రలో ఆమె అభినయం ప్రేక్షకులను మెప్పించింది.

క్రాక్ తర్వాత అల్లరి నరేష్ నాంది సినిమాలో కూడా ఆమెకు మంచి పాత్ర దక్కింది. ఆ సినిమాతో కూడా వరలక్ష్మికి మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు గోపీచంద్ చేస్తున్న బాలయ్య బాబు సినిమాలో కూడా జయమ్మ అదే వరలక్ష్మి శరత్ కుమార్ కు ఓ మంచి పాత్ర ఇచ్చినట్టు తెలుస్తుంది. జయమ్మ తరహా పాత్రనే ఈ సినిమాలో కూడా గోపీచంద్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్ అంటే వరలక్ష్మి క్రేజ్ డబుల్ అవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

అంతేకాదు లేడీ విలన్ అనగానే తెలుగు దర్శక నిర్మాతలకు వరలక్ష్మి దృష్టిలోకి వస్తుందట. ఇప్పుడు ఆమె కోసం కొత్త పాత్రల్ సృష్టిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నెగటివ్ టచ్ ఉన్న లేడీ పాత్రకు వరలక్ష్మి పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. ఆల్రెడీ తెలుగులో ఆమె గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకుంది కాబట్టి మరిన్ని అవకాశాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ సినిమానే కాదు వరలక్ష్మి ఖాతాలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. వీటితో టాలీవుడ్ లో జయమ్మకు సూపర్ పాపులర్ రావడం పక్కా అని చెప్పొచ్చు. 

 




మరింత సమాచారం తెలుసుకోండి: