మోడల్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఎంతో మంది హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. చక్కనైన అందం, అందానికి తగ్గట్టు అభినయం.. కలబోసిన ముద్దుగుమ్మ కాజల్. కాజల్ ఎవరూ చేయలేని సాహసం కూడా చేసింది . ముఖ్యంగా ఈ తరం హీరోయిన్లలో మొట్టమొదటిసారిగా అటు తండ్రి తో హీరోయిన్ గా, ఇటు కొడుకు పక్కన హీరోయిన్ గా నటించి అందరిని అలరించింది. ఈరోజు కాజల్ తన 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇక ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
1. 1985 జూన్ 19వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో వివేక అగర్వాల్, సుమన్ అగర్వాల్ దంపతులకు కాజల్ అగర్వాల్ జన్మించింది ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు నిషా అగర్వాల్. ఇక ఇందులో గమ్మత్తయిన విశేషం ఏమిటంటే , తనకంటే చిన్న వయసు అయిన తన చెల్లెలు నిషా అగర్వాల్ 2013 లోనే ముంబైకి చెందిన బిజినెస్ మాన్ కరుణ్ వలేజా ను పెళ్లి చేసుకుంది.
2. డిగ్రీ చదువుతున్న సమయంలో తమన్నాతో కలసి కొన్ని చిన్న చిన్న యాడ్స్ లో నటించింది. ఇక అలా వీరిద్దరి స్నేహం మొదలైంది.
3. ఇక కాజల్ మోడల్ గా చేస్తున్నప్పుడు డైరెక్టర్ షమ్మీకపూర్ దర్శకత్వం వహించిన దిల్ హో గయానా చిత్రంలో దియామీర్జా పక్కన స్నేహితురాలిగా నటించింది.
4. 2006 లో దర్శకుడు భారతీయ రాజా గారు బొమ్మలాట సినిమాకు ఎంపిక చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది.
5. ఇక అదే సంవత్సరం 2006లో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లక్ష్మీ కళ్యాణం. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తొలి పరిచయం అయింది కాజల్. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్, రాజమౌళి అక్కడికి రావడంతో ఈమె రాజమౌళిని కలిసి మీ సినిమాలో నాకు ఒక అవకాశం ఇమ్మని అడిగింది.
6. ఇక మరోసారి అదే సంవత్సరంలో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమాలో సింధు మీనన్ తో కలసి నటించింది కాజల్. ఇక ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమె సక్సెస్ రేటు కాస్త పెరిగింది అని చెప్పవచ్చు.
7. సరోజ సినిమాలో ఈమె గెస్ట్ రోల్ కూడా చేసింది. అంతేకాదు అనుష్క నటించిన సైజ్ జీరో సినిమా లో కూడా గెస్ట్ పాత్ర పోషించింది. ఇక 2008 తమిళ్ సినిమాలో మొదటి సారి భారతీయ రాజా దర్శకత్వంలో సగం షూటింగ్ వరకు జరుపుకొని ఆగిపోయిన చిత్రంలో పూర్తిగా  నటించింది.
8. ఆ తర్వాత 2008లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, తెరకెక్కిన మగధీర చిత్రానికి మిత్రవింద పాత్ర కోసం ముందుగా తమన్నాను ఎంపిక చేయగా, కానీ ఆ పాత్రకు ఆమె సెట్ అవ్వకపోవడంతో, ఇక ఈ పాత్రకు కాజల్ ను తీసుకొని,  రాజమౌళి కాజల్ కు  ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది.

9. తమిళ స్టార్ హీరోలతో , తెలుగు స్టార్ హీరోలతో నటించిన కాజల్ ఆ తర్వాత నాగచైతన్యతో దడ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో, ఇప్పటికీ వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు.

10. అంతేకాదు సుమారుగా 14 మంది క్యాన్సర్ సోకిన పిల్లలకు చికిత్స కూడా చేయించింది.

11. 2020 అక్టోబర్ 30వ తేదీన ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. ఇక వివాహం అనంతరం వీరిద్దరూ కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా పలు చిత్రాలలో నటిస్తూ మంచి హీరోయిన్ గా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: