రౌడీ హీరో విజయ్ దేవరకొండ టాలెంట్ గురించి అందరికి తెలిసిందే. అనతికాలంలోనే యూత్ ఆడియెన్స్ ను అలరిస్తూ వచ్చి స్టార్ స్టేటస్ అందుకున్న హీరో అతను. నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో సోలో హీరోగా మారాడు. ఆ సినిమా హిట్ అవడంతో పర్వాలేదు అనిపించుకున్నాడు ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ అసలు టాలెంట్ చూపించాడు. సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫెయిల్యూర్ లవర్ గా విజయ్ నటన అదిరిపోయింది. అయితే పెళ్లిచూపులు సినిమాకు 5 లక్షలు పారితోషికం తీసుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాకు కూడా అదే 5 లక్షలు రెర్మ్యునరేషన్ గా తీసుకునాడట.

అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అవడంతో మన వాడి రేంజ్ మారింది. అయితే అర్జున్ రెడ్డి రిలీజ్ కు ముందే ఒప్పుకోవడం వల్ల గీతా గోవిందం సినిమాకు కూడా 5 నుండి 10 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడట విజయ్ దేవరకొండ. అయితే ఆ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అవడంతో తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన నోటా సినిమాకు భారీగా రేటు పెంచాడు విజయ్ దేవరకొండ. నోటా సినిమాకు విజయ్ దాదాపు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన ట్యాక్సీవాలా సినిమాకు 5 కోట్లు ఛార్జ్ చేశాడట.

ట్యాక్సీవాలా హిట్ అవడంతో విజయ్ క్రేజ్ మళ్లీ డబుల్ అయ్యింది. అందుకే డియర్ కామ్రేడ్ సినిమాకు ఏకంగా 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడట విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు అందుకే ఆ తర్వాత చేసిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు కూడా అదే 10 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడట విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినీమా కోసం విజయ్ దేవరకొండ 12 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. మొత్తానికి 5 లక్షలతో కెరియర్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ 12 కోట్ల దాకా ఎదిగాడు. అతని కృష్టి కష్టం అతన్ని ఇంతవాడిని చేసిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: