గత కొద్దీరోజులుగా బాలయ్యకి సక్సెస్ అందటం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో బాలకృష్ణ సినిమా ఒక్కటి. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఇది వీరిద్దరి కాంబినేషన్ కో వస్తున్న మూడో సినిమా.

గతంలో బాలయ్య బోయపాటి శ్రీనుతో కలిసి సింహా, లెజెండ్ సినిమాలు చిత్రీకరించారు. ఇక రెండు సినిమాలు బాలయ్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈతరం దర్శకుల్లో బోయపాటి శ్రీను మాత్రమే బాలయ్యకు సూటయ్యే కథలను తెరకెక్కిస్తున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక అఖండ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

అయితే అఖండ కథలో కొత్తదనం లేకపోయినా కథనం మాత్రం కొత్తగా ఉంటుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. ఈ సినిమాలో విలన్ తమ్ముడిని హీరో చంపడంతో ఈ సినిమా కథ మొదలవుతుందని తెలుస్తోంది. ఇక అజ్ఞాతంలోకి వెళ్లిన హీరో బయటకు రావడం సినిమాలో ట్విస్ట్ గా ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో 20 నిమిషాల పాటు జరిగే యాక్షన్ సన్నివేశం ఉంటుందని ఆ సీన్ మూవీకి హైలెట్ కానుందని తెలుస్తోంది.

అంతేకాదు.. బాలయ్య 20 నిమిషాల ఫైట్ సీన్ లో అఘోరా పాత్రలో కనిపిస్తారని పోస్టర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే మరి. అయితే అఖండ సినిమాలో బాలయ్య సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా.. బోయపాటి శ్రీను ఏడాది పాటు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారంట. రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని బోయపాటి శ్రీను అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: