తెలుగులో ప్రతి ఏడాది కొన్ని వందల ప్రేమ కధా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో కార్తికేయ హీరోగా నటించిన ఆర్ ఎక్స్ 100 సినిమా కూడా ఒకటి. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో సంచలన రికార్డులు సాధించింది. వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. సిటీ నుంచి వచ్చిన ఒక కాలేజ్ అమ్మాయి తన సొంత ఊరిలో తండ్రి దగ్గరకు పని మీద వచ్చిన కుర్రాడి మీద మనసు పారేసుకుని అతనితో రొమాన్స్ చేస్తోంది. 

అదే నిజమైన ప్రేమ అని భావించిన ఆ కుర్రాడు ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమె మాత్రం మరో గొప్పింటి సంబంధం చేసుకుని ఊరు విడిచి అమెరికా వెళ్ళి పోతుంది.. అయితే ఆమె తండ్రి ఆమెకు బలవంతంగా పెళ్లి చేశాడు అని ఎప్పటికైనా తన కోసం తిరిగి వస్తుందని హీరో ఎదురు చూస్తూ ఉంటాడు. చివరికి ఆమె తనను మోసం చేసి వెళ్ళిపోయింది అన్న విషయం తెలుసుకుని ఆమె పంపించిన మనుషుల చేతిలోనే చావు దెబ్బలు తిని ఆమె నిజంగా తనను చంపడానికి పంపిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి వెళ్లి ఆమె చేతుల్లోనే కన్నుమూస్తాడు.

వినడానికి కాస్త ఇబ్బందికరంగా నే ఉన్నా ఈ సినిమా మాత్రం అప్పట్లో అందరి హృదయాలను ద్రవింప చేసింది. ముఖ్యంగా లవ్ బ్రేక్ అప్ అయి తిరుగుతున్న కుర్రాళ్ళంతా ఈ సినిమా పాటలనే తమ రింగ్ టోన్స్ గా పెట్టుకొని తిరిగారు. అయితే ఈ సినిమా ఒక నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకుని చేయగా ఇలా మోసపోయిన విషయం డైరెక్టర్ కు స్వయంగా జరిగిందని అప్పట్లో చెబుతూ ఉండేవారు. ఇందులో నిజానిజాలు ఎంత మేరకు ఉన్నాయో తెలియదు కానీ సినిమా మాత్రం అందరిని ఆలోచింప చేసింది అని మాత్రం చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: