రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ kgf సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడు. ఆ సినిమా తరువాత ప్రభాస్ తో సలార్ సినిమాను చిత్రీకరించారు.

ఇక  దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ ని అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మూవీకి ఇటీవల ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ ఆఫర్ ను ఒప్పుకుంటే దాదాపు బడ్జెట్ ను రికవరీ చేసినట్లే అని సమాచారం. కాగా.. సలార్ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా సినిమా బిజినెస్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చింది. ఈ మూవీకి 50కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం.

అయితే ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తవ్వగా జూలై నెలలో మొత్తంగా పూర్తి చేయాలని అనుకున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ 130కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు సమాచారం. అంతేకాక నెట్ ఫ్లిక్స్ తో పాటు సోని, హాట్ స్టార్ కూడా సలార్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు గాని వాళ్ళు 100కోట్ల దగ్గరే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

అంతేకాక.. శాటిలైట్ రైట్స్ డీలింగ్ కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉన్నట్లు తెలిపారు. అయితే సలార్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే దాదాపు నిర్మాతలను సెవ్ చేసినట్లు సమాచారం. ఆ పైగా కొంత లాభాలు కూడా వస్తాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే థియేట్రికల్ బిజినెస్ తో బయ్యర్లకు ఈ సినిమా ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి మరి. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: