గతేడాది నుండి దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమకు కూడా చాలా దెబ్బతింది. చాలా సినిమా షూటింగ్స్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో.. హీరోలు కొత్త సినిమాలకు కమిట్ అవ్వడానికి దైర్యం చూపడం లేదు. ఇక ప్రస్తుతం టాలీవూడ్ స్టార్ హీరోలు రెండేళ్లుగా ఒక సినిమాని కంప్లీట్ చేయడానికే నానా కష్టాలు పడుతున్నారు.

ఇక సెకండ్ రేంజ్ హీరోలైతే మినిమం 2 లేదా 3 సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. చిన్న హీరోలు కూడా 4 సినిమాలకు మించి చేయకలేపోతున్నట్లు తెలుస్తోందో. ఇక చెప్పాలంటే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లే 7 ప్రాజెక్టులకు మించి చేయలేకపోతున్నట్టు సమాచారం. ఈ క్లిష్ట సమయంలో పది సినిమాలు సినిమాల్లో నటిస్తేనే పెద్ద రికార్డ్ గా చెప్పుకోవాలి మరి.

ఈ క్లిష్ట సమయంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఏకంగా 25 ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఈ విషయం వినడానికి కాస్త  షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి తమిళ్ తో పాటు తెలుగు,హిందీ భాషల్లో కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇక సినిమాలో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా 10 సినిమాలకు పైనే అతను నటిస్తున్నట్టు సమాచారం. అయితే మరికొన్ని ప్రాజెక్టులు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.

అంతేకాకుండా.. విజయ్ సేతుపతి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. బుల్లితెరపై విజయ్ సేతుపతి షో లు, వెబ్ షో లు కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన కొన్ని  కొన్ని ప్రాజెక్టులకు రైటర్ గా కూడా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇలా మొత్తంగా కలుపుకుని అతను 25 ప్రాజెక్టులు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇది ఇండియాలోనే ఇదొక కొత్త రికార్డ్ అని స్పష్టంగా అర్ధం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: