జబర్దస్త్ యాంకర్ అనసూయ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గర అయ్యింది ఈ యంకరమ్మా. ఇక ఆ తర్వాత పలు షోలలో యాంకరింగ్ చేసినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించలేకపోయింది. దీంతో మొదటి నుంచి జబర్దస్త్ నే అంటిపెట్టుకునే ఉంది అనసూయ.  జబర్దస్త్ యాంకర్ గా అలరించటమే కాదు మరో వైపు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.



 ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది అనసూయ.  ఇక ఇప్పటికే వరుస అవకాశాలు అందుకుంటోంది.  అయితే అనసూయ కు పెళ్లియి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఈ యాంకర్ మాత్రం ఎక్కడ ఏ విషయంలో తగ్గదు.  ముఖ్యంగా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అందాల ఆరబోత చేస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయపై ఎక్కువగా విమర్శలు వస్తుంటాయి  అయితే ఇలా విమర్శలు వస్తే శివంగిల తనపై విమర్శలు చేస్తున్న వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది అనసూయ.



 కానీ ఇటీవలే అనసూయ కు ఊహించని వ్యక్తితో ఒక ప్రశ్న ఎదురైంది.  చిన్న బట్టలు ఎందుకు వేసుకుంటారు అని అడగడంతో అనసూయ ఒక్కసారిగా షాకయ్యారు.  ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జబర్దస్త్ ఎపిసోడ్ కి యూట్యూబ్ లో ఎంత గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శివ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.  ఈ ఇక ప్రోమో కాస్త ఎంతో సందడి సందడి గా సాగిపోయింది. ఇక చివర్లో నేను అనసూయ గారిని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను అంటూ జబర్దస్త్ స్టేజీపై చెబుతాడు యాంకర్ శివ. మీరు చిన్న చిన్న బట్టలు వేసుకుంటే  సోషల్ మీడియాలో విమర్శలు చేస్తారు దీనిపై మీ స్పందన ఏమిటి అంటూ అడుగుతాడు.  అది నా లైఫ్ నా ఇష్టం అంటూ సమాధానం చెబుతుంది అనసూయ.. మీ ఇష్టం అయితే మీ ఇంట్లో వేసుకోవచ్చు కదా అంటూ శివ ప్రశ్నించడంతో ఒక్కసారిగా అనసూయ అవక్కవుతుంది.  ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటి ఆది ఇది అంటూ స్టేజీ దిగి వెళ్లి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: