ప్రేమలో ఉన్న నా అనుబంధాన్ని, ప్రేమలో ఉన్న మధురానుభుతి ని మన టాలీవుడ్ దర్శకులు చాలా సినిమాల ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. ప్రేమలో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయో అన్ని రకాల ఎమోషన్స్ పై సినిమాలు చేసి. ప్రేక్షకులను ప్రేమ అనే సముద్రంలో నుంచి తేల్చారు. అందుకే ప్రేమకథా చిత్రాలు ఎన్ని వచ్చినా కూడా అవి ప్రేక్షకులకు నచ్చకుండా ఉండవు. హీరోలు మారవచ్చు.. హీరోయిన్లు మారవచ్చు.. దర్శకులు మారవచ్చు కానీ ప్రేమ అనే ఎమోషన్ మాత్రం మారదు. ఈ ఎమోషన్ ను వారి వారి స్టైల్స్ లో ఎలా తెరకెక్కించాం అనేది అసలు విషయం.

ఆ విధంగా ప్రేమలోని సరికొత్త ఫీల్ ను మనకు తెలియజేసిన సినిమా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి టాలీవుడ్ ఎంట్రీ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లోనే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 2017 జూలై 21 న విడుదలైన ఈ సినిమా మా కేవలం 15 కోట్ల రూపాయలతో మాత్రమే నిర్మించబడి 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

అమెరికాలో పుట్టి పెరిగిన హీరో తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోయిన్ గ్రామానికి వచ్చి తన అన్న చేసుకోబోయే భార్య చెల్లెల్ని ప్రేమిస్తాడు. అయితే అక్క పెళ్లి అయ్యాక అమెరికా వెళ్ళి పోవడం చూసి బాధపడుతుంది. తను మాత్రం పెళ్లైనా తండ్రితోనే ఉండి పోవాలి అనుకుంటుంది. ఈ విషయంతో పాటు తన ప్రేమను వ్యక్తం చేసి అతని ఇక్కడే ఉండిపోవాలని కోరుకుంటుంది కానీ హీరో మాత్రం అమెరికాలో మంచి డాక్టర్ కావాలనేది కోరిక అని చెబుతాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కలిగిన ఎమోషన్స్, ఎడబాటు, వైరాగ్యం ఇవన్నీ సినిమాలో చాలా చక్కగా చూపించారు శేఖర్ కమ్ముల. ఈతరం ఖుషి సినిమా గా మెగా ఫ్యాన్స్ ఫిదా ను అభివర్ణిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: