టాలీవుడ్ లో సూర్యకాంతం, తెలంగాణ శకుంతల తర్వాత లేడీ విలన్ పాత్రలు పోషించే నటీమణులు చాలా తక్కువ అయ్యారు అని చెప్పొచ్చు. మధ్య లో ఒక్కరిద్దరు ప్రయత్నించినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు.. నిజానికి విలనిజం అంటే టాలీవుడ్ సినిమాల్లో మగవారే చేయాలనే పద్ధతి అనాదిగా వస్తోంది కానీ సూర్యకాంతం తెలంగాణ శకుంతల నటీమణులు ఆడవారిలోనూ విలనిజం చాలా ఉంటుంది అని నిరూపించారు. అయితే చాలా రోజుల నుంచి తెలుగులో ఈ తరహా పాత్రలు చేసే నటీమణులు కరువు అవుతున్నారు. అందుకే ఫిమేల్ విలనిజం సినిమాలు రావడం తక్కువ అయ్యాయి తెలుగులో.

ప్రస్తుతం ఇలాంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె ఇలాంటి పత్రాలు చేస్తూ టాలీవుడ్లో విశేషంగా రాణిస్తుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లేడి విలన్ పాత్రకు ఈమె ఈమెనే సంప్రదిస్తున్నారు మేకర్స్.. ఇటీవలే ఆమె విలన్ గా చేసిన క్రాక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అంతకుముందు కూడా అల్లరి నరేష్ నాంది సినిమాలో పవర్ ఫుల్ పాత్రను చేసి హిట్ అందుకున్నారు వరలక్ష్మి. సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ సినిమాలో ఆమె చేసిన విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

విజయ్ నటించిన సర్కార్ సినిమాలో కూడా ఆమె విలన్ గా నటించి మెప్పించింది. ఇకపోతే కు క్రాక్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ని బాలకృష్ణ సినిమాలో మళ్లీ విలన్ గా చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈమె ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ చిత్రంలో కూడా ఓ పాత్ర పోషిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. జాంబీ రెడ్డి తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న హనుమాన్ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు అని వార్తలు వస్తుండగా ఈ సినిమాలోని కీలకమైన పాత్ర కోసం వరలక్ష్మి ని ఎంపిక చేస్తున్నారట చిత్రబృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: