సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ వ్రాసిన దేవదాసు నవల భారతీయ సినిమా నిర్మాతలకు ఎంతో ఇష్టమైన చిత్ర కథ ఉండేది. అందుకే 1950వ దశకంలో ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులు మెచ్చే విధంగా నిర్మించి సూపర్ హిట్ అవడానికి కారణం అయ్యారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం కి, అక్కినేని సావిత్రిల నటన, ఘంటసాల గానం ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచిపోయింది. భగ్న ప్రేమికులకు దేవదాసు అనే పదం తెలుగు సాహిత్యంలో భాగమైపోయింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు సుబ్బా రామన్ కు అంకితమిచ్చారు.  ధనికుడైన హీరో,  పేదరాలైన హీరోయిన్ ల మధ్య నడిచే ప్రేమకథా చిత్రమే ఈ సినిమా కథ.  చివరికి ఇద్దరూ విడిపోతారు.  అనే అంశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 1937లో హిందీలో పి.సి.బారువా దేవదాసు చిత్రాన్ని నిర్మించాడు. అదే సంవత్సరంలో తమిళంలోనూ సి.వి.రావు నటుడు దర్శకుడుగా దేవదాసు సినిమా ప్రేక్షకుల ముందు కు వచ్చింది. మళ్లీ 1955లో హిందీలో దిలీప్ కుమార్ వైజయంతిమాల, సుచిత్రాసేన్‌లతో దేవదాసు చిత్రం వచ్చింది.  హిందీలో షారుక్ ఖాన్ ఐశ్వర్యారాయ్ మాధురి దీక్షిత్ లో 2002లో ఇదే కథ సినిమాగా వచ్చింది.

అన్ని భారతీయ భాషలలో కలసి దాదాపు 10 సార్లు తీసి సినిమా విడుదల అయినా నాగేశ్వరరావు దేవదాసు నటించిన ఈ చిత్రానికి వచ్చినంత పేరు మరి దేవదాసు చిత్రానికి రాలేదు.  1974 లో కృష్ణ దేవదాసుగా నటించిన సినిమా విడుదలై 50 రోజులు ఆడితే మళ్లీ అదే సమయంలో విడుదలైన నాగేశ్వరరావు దేవదాసు 200 రోజులు ఆడింది.  ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు వేదాంతం రాఘవయ్య చిత్రీకరణ రాత్రుళ్ళు బాగా చేశారు దీని వల్ల నాగేశ్వరరావు నిద్ర లేక కళ్ళు తాగుబోతు కళ్ళు అయినట్లు సహజం గా కనిపించాయి.. భగ్న హృదయ పాత్రపై అక్కినేని ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: