నేటి సమాజంలో రహదారులన్ని రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఇక నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అయితే మితిమీరిన వేగం ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇరాక్ ఈ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతూనే ఉన్నాయి. ఈ అంశానికి అద్భుతమైన ప్రేమ కథను జోడించి తమిళంలో రూపొందించిన చిత్రం ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌. ఈ సినిమా తెలుగులో జర్నీగా డబ్బింగ్ చెప్పారు.

జర్నీ సినిమాను శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను సురేష్‌ కొండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సత్య సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్, జై నటించారు. హీరోయిన్ గా అంజలి, అనన్య నటించారు. ఈ సినిమాలో రెండు లవ్ స్టోరీలను తెరకెక్కించారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. శర్వానంద్‌ తన స్నేహితుడిని డ్రాప్‌ చేయడానికి హైదరాబాద్‌ బస్టాండ్‌కు వస్తారు. అయితే అక్కడికే వచ్చి తను వెళ్ళాల్సిన సాఫ్ట్‌వేర్ కంపెనీ అడ్రసు తెలీయక తన అక్కతో ఫోన్‌లు మాట్లాడుతుంది అనన్య. అనన్య విలేజ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుంది. ఆమె అక్క వేరే పని వల్ల రిసీవ్‌ చేసుకోలేక పోతుంది. సిటీలో చాలా జాగ్రత్తతో ఉండాలని సూచనలు కూడా చేస్తుంది. అలా శర్వానంద్ సహాయంతో ఇంటర్వ్యూ పూర్తి చేసుకుంది. ఇక శర్వానంద్ ఆమె అమాయకత్వానికి నచ్చి ప్రేమలో పడుతాడు.

ఇక మరోవైపు....జై టెక్నికల్‌ కోర్సు చేసి అప్రంటిస్‌గా పనిచేస్తుంటాడు. కొద్దిగా దూరమైనా ఎదురింటి అంజలిని జై ప్రేమిస్తుంటాడు. అయితే తనను ప్రేమించాలంటే కొన్నింటికి తట్టుకోవాలని అంజలి జైకు పరీక్ష పెడుతుంది. ఇక ఆ పరీక్షలో నెగ్గిన అతన్ని అంజలి ప్రేమిస్తుంది. అయితే జై తన తల్లి దగ్గరకు అంజలిని తీసుకెళ్లడానికి బస్‌ ఎక్కుతారు.

అయితే అటువైపు నుంచి అనన్యని వెతుక్కుంటూ శర్వానంద్‌ బస్‌ ఎక్కుతాడు. ఇక ఇంటర్వ్యూ ముగించుకుని అనన్య బస్‌ ఎక్కుతుంది. ఇక డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. ఈ ప్రమాదంలో జై ప్రాణాలు కోల్పోతాడు. ఇక అనన్య ప్రాణాలతో పోరాడి బ్రతుకుంది. ఈ సన్నివేశాన్ని డైరెక్టర్ కళ్లకు కంటినట్లు చూపించాడు. అంతేకాదు.. ఈ సినిమా ఎండింగ్ అందరిని కంటి తడి పెట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: