తన అందం, అభినయంతో దశాబ్దాలపాటు దక్షిణ భారతీయ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఈ రోజు అనగా జూన్ 19న తన 36వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.


హిందీ మాట్లాడే కుటుంబంలో జన్మించినప్పటికీ కాజల్ అగర్వాల్ హిందీ భాషేతర సినిమాల్లో చాలా సహజంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా మగధీర సినిమా ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె తండ్రి వినయ్ అగర్వాల్ ఒక పారిశ్రామికవేత్త కాగా ఆమె తల్లి సుమన్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్ విక్రయించేవారు. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన "క్యూన్! హోగయా నా" సినిమాలోని ఓ పాట ద్వారా ఆమె బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. ఈ సినిమా లోని ప్యార్ మే అనే పాటలో ఐశ్వర్యరాయ్ పక్కన ఆమె కనిపించారు.



ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ముంబైలోని కొలాబాలోని సెయింట్. అన్నేస్ హైస్కూల్ లో ప్రాథమిక విద్యనభ్యసించారు. జై హింద్, కే.సీ (కిషిన్‌చంద్ చెల్లారాం) కాలేజీ లలో ఉన్నత చదువు పూర్తి చేశారు. ఆమె మాస్ మీడియా మార్కెటింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని కూడా తనకు ఉన్నట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమాల వైపు అడుగులు వేశారు.



ఆమె తన సొంత డబ్బులతో ఒక వైట్ ఆడి కారు కొనుగోలు చేశారు. కాజల్ ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి తన పనులు చేసుకుంటారు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఆమె అమితంగా తింటారు. ఆమె ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లాగా ఎవరూ వంట చేయలేరని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆమ్లెట్ తయారు చేయగలనని కూడా ఆమె చెప్పుకొచ్చారు.


కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కలిసి దిగిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ అయ్యాయి. తమన్నా తో మాత్రమే కాదు సమంత తో కూడా కాజల్ అగర్వాల్ స్నేహం చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: