ప్రతి హీరోకి వారి కెరీర్ లో స్టార్ ని చేసే ఒక సినిమా పడుతుంది. అలా పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ చేసిన సినిమా ఖుషి. ఈ సినిమా కథ గురించి చెప్పాలి అంటే కాలేజ్ లో జరిగే ఒక క్యూట్ ప్రేమకథ. ఇందులో భారీ ఎమోషనల్ సీన్స్ లేవు రక్తలు వచ్చేలా ఫైట్స్ లేవు కానీ ఈ సినిమా అప్పట్లో ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టేసింది. దానికి కారణం ఏంటి అని చూస్తే కళ్ళకి ఇంపుగా అనిపించే సినిమాటోగ్రఫీ , చెవులకి హాయిని ఇచ్చే సంగీతం , చూడటానికి క్యూట్ కనిపించే హీరో హీరోయిన్స్ సాఫీగా సాగిపోయే స్క్రీన్ ప్లే ఇవే ఒక సాధారణ సినిమాని ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి తీసుకెళ్లయి. నిజానికి ఈ సినిమా తమిళ ఖుషి రీమేక్ అంటారు కానీ డైరెక్టర్ ఎస్ జే సూర్య దీన్ని రెండు భాషల్లో ఒకటేసారి చేయాలి అనుకున్నారట. అయితే డేట్స్ క్లాష్ వల్ల అది కుదరక ముందుగా తమిళ ఖుషి  విడుదలయ్యింది.
అయితే ఆ ఆలస్యం సినిమాకి మంచి చేసింది అనే చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఖుషి కి పి సి శ్రీరామ్ లాంటి గ్రేట్ సినిమాటోగ్రాఫర్ దొరికారు. ఈ సినిమాలో ఆయన నిజంగానే మ్యాజిక్ చేశారు. ఖుషి లో భూమికకు 80 శాతం మేకప్ లేదు అంటే నమ్ముతారా. ప్రస్తుతం హీరోయిన్స్ ని మేకప్ లేకుండా చూడలేకపోతుంటే పి సి శ్రీరామ్ మాత్రం భూమికని చాలా సన్నివేశాల్లో ఏ మేకప్ లేకుండా అంత అందంగా చూపించారు అంటే ఆయన గొప్పతనం తెలుసుకోవచ్చు.
ఇక ఒక తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య తెలుగు నేటివిటీ ని ఇంత బాగా అర్థం చేసుకొని సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టడం నిజంగా విశేషం అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్ చేశారు. సినిమాలో ఆయన వేసిన డ్రెస్సులు , బాగ్ అప్పట్లో ఓ రేంజ్ సెన్సేషన్ సృష్టించాయి. ఖుషీలో పని చేసిన అందరి కెరీర్ ఈ సినిమాతో మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: