టాలీవుడ్ లో కాలేజీ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా హ్యాపీడేస్ చిత్రం మాత్రం ప్రతి తరం స్టూడెంట్ కు ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్ , నిఖిల్, రాహుల్ , తమన్నా ముఖ్య పాత్రలు పోషించగా ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి స్థాయిలో ఉన్నారు. వరుణ్ తేజ్ హీరోగా మంచి స్థానానికి వెళ్లగా, నిఖిల్ కి మంచి మార్కెట్ నెలకొంది.. తమన్నా టాప్ హీరోయిన్ గా ఉంది.

 టాలీవుడ్ కి ఎలాంటి బ్యాగ్రౌండ్ ఇమేజ్ లేకుండా వచ్చిన శేఖర్ కమ్ముల 2007వ సంవత్సరంలో తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.  అప్పటి యూత్ ఈ సినిమా చూసి పిచ్చెక్కి పోయారు ఈ చిత్రంలోని ప్రతి పాత్ర మనం చదువుకునే రోజుల్లో కాలేజీలో ఎవరో ఒకరు మన ఫ్రెండ్ గా ఉండే ఉంటారు అనిపించేలా ఉంటుంది. ఇకపోతే అన్ని పాత్రలు ఈ సినిమా లో  మనకు గుర్తుంటాయి.. ముఖ్యంగా  ఈ సినిమాలో గాయత్రీరావు నువ్వు అప్పు మాత్రం అంత తేలికగా మర్చిపోలేము. నిఖిల్ జోడిగా ఎంతో కనువిందు చేశారు ఈమె.

అయితే ఈ సినిమా తర్వాత ఎక్కువగా సినిమాలో కనిపించలేదు గాయత్రీ.  రామ్ చరణ్ తేజ్ ఆరంజ్ సినిమాలో మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించి కనుమరుగైపోయింది.  గత ఏడాది పెళ్లి చేసుకున్న ఇప్పుడు చెన్నైలో స్థిరపడిపోయింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.  సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ఈమె తల్లి పద్మ ఎప్పటినుంచో టాలీవుడ్ లో నటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీరియల్స్ లో ఈమె మోస్ట్ బిజీ గా ఉండే ఆర్టిస్ట్. హ్యాపీ డేస్ సినిమా లో నిఖిల్ తల్లిగా నటించింది. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న గాయత్రీరావు తెరపై మళ్లీ చూడాలన్నా  అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: