తెలుగు సినిమా పరిశ్రమ లో గుర్తింపు పొందిన హాస్య నటుల్లో ఒకరు బ్రహ్మానందం. సినిమాల్లో కమెడియన్ కి చోటు ఉంటుంది కానీ బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాకు వెళ్లడం అనవసరం అనేంతగా బ్రహ్మానందం తన కామెడీతో ప్రేక్షకులను అలరించేవారు. అయన నటించిన సినిమాలతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన బ్రహ్మానందం ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఒకటి రెండు సినిమాల్లో అలా వచ్చి ఇలా కనపడుతూ వెళ్తున్నారు. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు అనుకునే ప్రేక్షకులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. తన హాస్యంతో కడుపుబ్బ నవ్వించే కమెడియన్ బ్రహ్మానందం ఇటీవలే జాతిరత్నాలు మూవీ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా లో జడ్జ్ గా కామెడీ పండించారు.

ఆయన చేసిన ఎన్నో సినిమాలు ఆయనకు మంచి పేరును తీసుకురాగా హాస్య నటుడిగానే కాకుండా ఎమోషనల్ పాత్రలు కూడా చేయగలనని కొన్ని పాత్రల ద్వారా తెలియజేశారు.  తెరపై ఎన్నో నవ్వులు పండించిన ఆయన సినిమాల విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా పర్సనల్ గా  వ్యక్తిగత జీవితం కొంతమందికి మాత్రమే తెలుసు.  గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటి వారి పాలెం లో జన్మించిన బ్రహ్మానందం పెద్దల ఆశీర్వాదంతో లక్ష్మి అనే యువతితో పెళ్లి అయింది. వీరికి రాజా గౌతమ్,  సిద్ధార్థ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు

తండ్రి నాటకాల్లో వేషాలు వేయడం వలన బ్రహ్మానందం కు కూడా నాటకాలంటే ఇష్టం పెరిగింది ఫ్రెండ్స్ ముందు కామెడీ చేసే వాడు. దూరదర్శన్ లో పకపకా ప్రోగ్రాం లో చేశాడు. అలా టాలీవుడ్ దర్శకుల కంట్లో పడ్డారు.. జంధ్యాల దర్శకత్వంలో ఆహనా పెళ్ళంట మూవీ తో ఇండస్ట్రీలోకి వచ్చిన బ్రహ్మానందం ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు.  ప్రస్తుతం కోటి నుంచి 50 లక్షల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇష్టమైన హీరోలు. మహానటి సావిత్రి ఇష్టమైన హీరోయిన్. ఆయనకు దాదాపు ఏడు కోట్ల విలువైన విలా ఉంది. 350 కోట్లు నెట్వర్త్ కలిగిన బ్రహ్మానందం హైదరాబాద్ మణికొండ లో నివసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: