తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అందులో వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి.ఇక ఈ మధ్య కాలంలో జనాలను ఆలోచింపజేసే ఒక అధ్బుతమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఉప్పెన'.ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేమకు ఒక సరికొత్త నిర్వచనాన్ని తెలిపింది. ఒక నూతన దర్శకుడు చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచేలా చేసింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగానూ..మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అయ్యారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా గత ఫిబ్రవరి 12 న విడుదలై సంచలన విజయం సాధించింది.

సినిమా విడుదలకు ముందు దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమా కథను దర్శకుడు మలిచిన విధానం.. అగ్ర దర్శకులను సైతం ఆశ్చర్య పోయేలా చేసింది.ఒక ప్రేమకథను ఇలా కూడా ప్రేక్షకులకు చెప్పొచ్చా.. అనేంతలా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.ఇక సినిమాలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ల నటన,వారి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని కట్టిపడేసింది. అంతేకాదు ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చాడు. ఇక సినిమాలో ప్రేమ గొప్పతనం గురించి తన తండ్రి (విజయ్ సేతుపతి)కి కూతురు (కృతి శెట్టి) చెప్పే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఇక చివరగా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా ప్లాన్ చేసిన దర్శకుడు..

దాన్ని ఏ విధంగా ప్రేక్షకులకు చెప్తే అర్ధం అవుతుందో..అంతకు మించేలా దర్శకుడు కథను చెప్పిన విధానం..ఇలా అన్నీ ఈ సినిమా విజయంలో కీలక పాత్రలు పోషిస్తాయి.ఇక ఈ సినిమాకి సంబంధించి తెర వెనుక చాలా చాలానే జరిగాయి.ముందుగా ఈ సినిమా కథని మెగాస్టార్ చిరంజీవి కి వినిపించగా..అది ఆయనకు బాగా నచ్చి, వైష్ణవ్ తేజ్ ని హీరోగా సూచించడం జరిగిందట. ఇక ఆ తర్వాత కరోనా రావడంతో సరిగ్గా విడుదల చేసే సహాయానికి థియేటర్లు మూత పడ్డాయి. అప్పుడు సినిమాని ఓటీటీ లో విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు.కానీ సినిమా చూసిన చిరూ..సినిమాని థియేటర్ లో విడుదల చేస్తే.. ఘన విజయం సాధిస్తుందని చెప్పాడట. ఇక ఆయన అన్నట్లుగానే ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: