పర భాషా నుంచి వచ్చే కొన్ని సినిమాలు మేకర్స్ కి ఎంతలా నచ్చుతాయి అంటే ఆ సినిమా పోస్టర్ ని చూసి ఆ సినిమా హక్కులు కొనడానికి రెడీ అవుతారు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా పట్టించుకోరు. మనసుకు నచ్చితే ఎంతైనా పెట్టి హక్కులు కొని దాన్ని ఇక్కడివారకి నచ్చేలా తీర్చి దిద్ది హిట్ కొడతారు.  అది ప్రేక్షకులకు నచ్చుతుంది అనే ఆశాభావం ఉంటే చాలు ఆ సినిమా ఎన్ని కోట్లు పెట్టి అయినా తెలుగులో పునర్నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తారు.  

కొన్ని కొన్ని సార్లు సినిమా రిజల్ట్ కి అతీతంగా కొన్ని సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ ను సొంతం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.  ఇక్కడ ప్లాప్ అయిన కొన్ని సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యి  అక్కడ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.  లేటెస్ట్ గా హిందీ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఓ ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా తొలిదశ తర్వాత హిందీ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఒకటి ముంబై సాగా.. ఇమ్రాన్ హష్మీ మరియు జాన్ అబ్రహం నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ  సుమారు రెండు వందల స్క్రీన్స్ లలో రిలీజ్ అవగా ఈ సినిమా కి ప్లాప్ టాక్ వచ్చింది.

సినిమా 30 కోట్ల బడ్జెట్ తో రూపొందగా ఇది ప్లాప్ టాక్ తెచ్చుకొని రొటీన్ మాస్ మసాలా మూవీ గా 20 కోట్లు మాత్రమే వసూలు చేసి పది కోట్ల నష్టంతో బయటపడింది. ఈ కలెక్షన్స్ తో వసూళ్లను ముగించుకున్న ఈ సినిమా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో చేస్తే బాగుంటుందని రీమేక్ రైట్స్ ని 50 లక్షలు చెల్లించి సొంతం చేసుకురట ఓ టాప్ ప్రొడ్యూసర్.  మరి ఈ సినిమాలో హీరోలు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది.  వీరిలో మెగా హీరో వరుణ్ తేజ్ ఉండబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. మరి రీమేక్ సినిమాలను చేంజ్ చేసి బాగా తీయడంలో మన దర్శకులు ఎంతో పండిపోయిన నేపథ్యంలో ఈ సినిమాను ఇక్కడ హిట్ సినిమాగా ఎలా మలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: