ఇక వెండితెర మీద కింగ్ లాంటి సినిమా అంటే బాహుబలి అనే చెప్తారు. ఇక వెండి తెర మీద బాహుబలి ఎలాగో బుల్లి తెర మీద కార్తీక దీపం సీరియల్ అనే చెప్పాలి.ఇక మన సినిమాల్లో రికార్డుల్ని లెక్కకట్టాలంటే బాహుబలి ఇంకా నాన్ బాహుబలి అని ఎలాగైతే అంటుంటారో.. సీరియల్స్‌లో అయితే కార్తీకదీపం నాన్ కార్తీకదీపం అనేట్టుగా తయారైంది పరిస్థితి. మన ఇండియాలోనే హయ్యెస్ట్ టీఆర్పి రేటింగ్ సాధిస్తూ అనేక సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్‌లో హీరోగా నటిస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాలకి బీభత్సమైన ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చేసింది. అది కూడా ఎంతలా అంటే ఓ వంద సినిమాలు చేసిన హీరోకి వచ్చినంత పేరు ఈ డాక్టర్ బాబుకు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.ఇక సినిమా స్టార్ హీరోలనైనా గుర్తుపడతారో లేదో తెలియదు కానీ.. ఈ బుల్లితెర స్టార్ డాక్టర్ బాబుకి అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి బామ్మల వరకూ ఫ్యాన్సే. ఎందుకంటే ప్రతి ఇంటిలో కూడా ‘కార్తీకదీపం’ సీరియల్‌ని వీక్షించేవాళ్లు ఉన్నారు కాబట్టి..

అయితే బుల్లితెరపై సూపర్ స్టార్ అనిపించుకున్న డాక్టర్ బాబు.. త్వరలో వెండితెరపై కూడా తన అడుగు పెట్టబోతున్నారు. స్వయంగా నిరూపమే టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఇక నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ.. ‘బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వెళ్లడం అనేది మన చేతుల్లో ఉండదు. సినిమాల్లో నటించాలనే ఉంది. కార్తీకదీపం లాంటి సీరియల్ వచ్చినట్టే.. సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పుకుండా చేస్తా. కొన్ని మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ.. నాకు సరిపోయే పాత్రను ఎంపిక చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది.ఇక సినిమాల్లో అయితే చేయాలనే ఆసక్తి ఉంది.

అయితే ఎలాంటి పాత్రల్ని ఎంచుకోవాలనే బాగా డైలామాలో ఉన్నా.. ఇక ఇప్పటి వరకూ నన్ను సీరియల్స్‌లో ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగానే చూశారు. ఇక సినిమాలంటే.. వాటికి నేను ఫిట్ అవుతానా? లేదా? ఆలోచించి అడుగులేస్తున్నారు. ఇక చేస్తే పలానా పాత్రే చేయాలి.. పలానా ఫైట్స్ చేయాలి.. ఆ డాన్స్ చేయాలని లేదు. నా దృష్టిలో సబ్జెక్ట్ అంటే హీరో.. ఇక ఆ సబ్జెక్ట్‌లో నేనో పాత్రను మాత్రమే.ఇక అది సినిమా అయినా సీరియల్ అయినా. ఇక బిగ్ స్క్రీన్‌పై నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.. ఇక వెంకటేష్ గారి సినిమాలు కూడా బాగా చూస్తా. మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్ టైం ఫేవరేట్. ఇక హీరోయిన్స్ అయితే చాలామంది ఉన్నారు..వారు సీజనల్‌గా మారిపోతుంటారు’ అని చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.

మరింత సమాచారం తెలుసుకోండి: